RRR Movie: స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రంతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించాడు రాజమౌళి. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని దక్కించుకొని తానేంటో నిరూపించుకున్నాడు జక్కన్న. ఆ తర్వాత నుంచి ప్రతి సినిమాతో సక్సెస్ ను అందుకుంటూ సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ పోతున్నాడు జక్కన్న. బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు రాజమౌళి. అయితే ప్రస్తుతం జక్కన్న ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి, మెగా ఫ్యామిలి లు కలిసి నటిస్తున్న మొదటి సినిమా ఇదే కావడంతో సినీ వర్గాల్లో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ భారీ మల్టీ స్టారర్ చిత్రం అనౌన్స్ అయ్యి సరిగ్గా ఈరోజుతో నాలుగేళ్లు కంప్లీట్ చేసుకుంది. సరిగ్గా నాలుగేళ్లు క్రితం 2017లో దర్శకుడు రాజమౌళి ఈ చిత్రాన్ని ఒక ఫ్లెజెంట్ ఫోటో తో అనౌన్స్ చేశారు. అప్పటి నుంచి ఈ సినిమా గురించి తెలుగు ప్రేక్షకులతో పాటు దేశ విదేశాల్లోని మూవీ అభిమానులంతా ఎదురుచూస్తున్నారు.
4 years since he posted this pic leaving room for so many speculations… 3 years since we began filming #RRRMovie… 50 Days for you to experience the magic on the big screen 💥💥
Oohinchani Chitra Vichitram… Snehaaniki Chaachina Hastham…❤️🙌🏻
Jan 7th, Let’s blast!! https://t.co/S0prnnO4FM
— RRR Movie (@RRRMovie) November 18, 2021
ఇప్పుడు దీనితో ఈ భారీ సినిమా చిత్ర యూనిట్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. నాలుగేళ్లు కిందట రాజమౌళి ఈ పిక్ పెట్టి ఎన్నో ఊహాగానాలకు నాంది పలికారు. సినిమా మొదలు పెట్టి 3 ఏళ్ళు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 50 రోజుల్లో ఈ సినిమా మ్యాజిక్ ని రిలీజ్ చెయ్యడానికి రెడీ చేస్తున్నాం అని ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు, ప్రోమో లకు భారీ స్పందన లభించింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవారిఓ 7 వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: 4 years completed for ram charan and ntr rrr movie
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com