TDP: ఆంధ్రప్రదేశ్ కు వైసీపీకి ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో విజయం సాధించినా ఓటింగ్ శాతం మాత్రం తగ్గిపోయింది. దీంతో అధికార పార్టీ వైసీపీ ఆలోచనలో పడుతోంది. కమలాపురం, రాజంపేట వంటి చోట్ల ఐదు వార్డుల్లో టీడీపీ విజయం సాధించడంతో వైసీపీలో అంతర్మథనం మొదలైంది. చాలా ప్రాంతాల్లో స్వల్ప ఓట్ల తేడాతోనే ఓటమి చెందడం తెలిసిందే. దీంతో వైసీపీ, టీడీపీ మధ్య పోరు రసవత్తరంగా సాగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ తన ఓటు బ్యాంకును కాపాడుకునే క్రమంలో విఫలం చెందుతుందా అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.

దీంతో వైసీపీకి వ్యతిరేకత వస్తుందా అని అందరిలో సంశయాలు వస్తున్నాయి. ఈ పరిణామాలు వైసీపీకి ఇబ్బందికరంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఇవి ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలే అని విశ్లేషకులు అంచనా వేస్తన్నారు. కుప్పం లో గెలిచామని గొప్పలు చెప్పుకుంటున్నా నైతికంగా టీడీపీనే విజయం సాధించిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో పోలింగ్ లో ఎక్కువ శాతం టీడీపీకి పోలైనట్లు తెలుస్తోంది.
ప్రభుత్వంపై వ్యతిరేకత ఇలాగే కొనసాగితే భవిష్యత్ లో పార్టీ భవితవ్యం ఏమిటనేది అందరిలో నెలకొంటున్న అభిప్రాయాలు. ఎందుకు ఇంత వ్యతిరేకత ప్రభుత్వంపై వస్తోందని పార్టీ నేతల్లో కూడా గుబులు పెరుగుతోంది. ఈ క్రంలో వైసీపీ ఏ మేరకు ప్రతిపక్షాన్ని ఎదుర్కొంటుందని నేతలు ఊగిసలాటలో పడిపోయినట్లు తెలుస్తోంది.
రాబోయే ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉన్నా ప్రభుత్వంలో మాత్రం ఆలోచనలు మొదలయ్యాయి. టీడీపీని నిలువరించే క్రమంలో భాగంగా ఏ విధమైన విధానాలు అవలంభించాలనే దానిపై అధినేత దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. దీంతో అధికార పార్టీ నేతలు ప్రతిపక్ష పార్టీని ఢీకొనేందుకు పావులు కదుపుతుందని తెలుస్తోంది.
Also Read: భార్య పైన అనుమానంతో ఆ భర్త చేసిన పని వింటుంటే కనీళ్ళు ఆగవు ..!