Sivakarthikeyan: మన హీరోల పారితోషికాల పై రాజకీయ నాయకులు కూడా కుళ్ళుకుంటున్నారు. ఆ రేంజ్ లో మన స్టార్లు కోట్లు పై కోట్లు పుచ్చుకుంటున్నారు. నిజానికి ఈ పారితోషికం అనే ఐటమ్ పై ఎవరికీ క్లారిటీ లేదు. కొందరు హీరోలు సినిమాకి వచ్చిన లాభాల్లో వాటా తీసుకుంటారు. ఇక చాలా మంది స్టార్ హీరోలు ప్రభాస్, మహేష్, బన్నీ వాళ్ళ ఓన్ బ్యానర్స్ లాంటి వాటిల్లోనే ఎక్కువగా సినిమాలు చేస్తారు.

అలాంటప్పుడు ఏ హీరో పారితోషికం ఎంత అనేది తెలియదు. అసలు అలాంటి రిలేషన్స్ ఉన్న బ్యానర్స్ లో హీరోలకు పారితోషికాలు ఇవ్వరు. లాభాల్లో వాటాలు ఉంటాయి. కానీ, ఫ్యాన్స్ ను హ్యాపీ చేయడానికి ఫలానా హీరో 50 కోట్లు తీసుకున్నాడు, మరో హీరో 40 కోట్లు తీసుకున్నాడు అంటూ లేనిపోనీ బిల్డప్ మాటలను అభిమానుల మధ్యలోకి వదులుతారు.
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ కావాలా.. ఇంటినుంచే సులువుగా దరఖాస్తు చేసుకునే ఛాన్స్!
ఇప్పుడు ఆ మాటలే ఏపీలో థియేటర్స్ దయనీయ దుస్థితికి కారణం అయింది. ఇది ఇలా ఉంటే.. ఇప్పుడు మన నిర్మాతలు తమిళ హీరోలతో కూడా సినిమాలను ప్లాన్ చేస్తున్నారు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ కథానాయకుడిగా ఓ చిత్రం రాబోతుంది. ఇది తమిళంలో పాటు తెలుగులోనూ రూపుదిద్దుకుంటోంది.
కాగా ఈ సినిమా కోసం శివకార్తికేయన్ కి ఏకంగా రూ.32 కోట్ల పారితోషికం ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో అసలు ఎంత నిజం ఉంది ? సురేష్ బాబు, నారాయణ్ దాస్ నారంగ్, శాంతి టాకీస్ ఈ సినిమాను నిరిస్తున్నారు. ఈ మధ్యే ఈ చిత్రం లాంఛనంగా మొదలైంది. శివ కార్తికేయన్ తెలుగులో నటిస్తున్న తొలి సినిమా ఇది.
కాకపోతే.. తమిళంలో శికార్తికేయన్ కి రూ.50 కోట్ల వరకు మార్కెట్ ఉందని తెలుస్తోంది. అందుకే, రూ.30 కోట్లు ఇచ్చి తెలుగు తమిళంలో కలిపి రూ.100 కోట్లు రాబట్టాలి అని నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే 30 కోట్లు ఇచ్చారట.
Also Read: అధికార పార్టీ ఆగడాలపై మండిపడుతున్న టీడీపీ .. గుంటూరులో ఎన్టీఆర్ విగ్రహాల ధ్వంసం