https://oktelugu.com/

Prabhas Adipurush: షూటింగ్ పూర్తి కాకముందే ౩౦౦ కోట్ల రూపాయిల లాభం..ప్రభాస్ ఆదిపురుష్ క్రేజ్ మాములుగా లేదుగా!

Prabhas Adipurush: పాన్ ఇండియా అనే పదం వింటే మన అందరికి టక్కుమని గుర్తుకు వచ్చే పేరు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్..బాహుబలి సిరీస్ తో స్టార్ స్టేటస్ ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగిపోయింది..ఆయన డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు కూడా 450 కోట్ల రూపాయిల రేంజ్ లో వసూలు చేస్తున్నాయి అంటే ప్రభాస్ కి ఉన్న స్టార్ స్టేటస్ ఎలాంటిదో ఊహించుకోవచ్చు..అందుకే ఆయనతో సినిమాలు చెయ్యడానికి ప్రొడ్యూసర్స్ వందల కోట్ల రూపాయిలు బడ్జెట్ కుమ్మరిస్తున్నారు..ప్రస్తుతం ప్రభాస్ మూడు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 3, 2022 / 11:37 AM IST
    Follow us on

    Prabhas Adipurush: పాన్ ఇండియా అనే పదం వింటే మన అందరికి టక్కుమని గుర్తుకు వచ్చే పేరు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్..బాహుబలి సిరీస్ తో స్టార్ స్టేటస్ ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగిపోయింది..ఆయన డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు కూడా 450 కోట్ల రూపాయిల రేంజ్ లో వసూలు చేస్తున్నాయి అంటే ప్రభాస్ కి ఉన్న స్టార్ స్టేటస్ ఎలాంటిదో ఊహించుకోవచ్చు..అందుకే ఆయనతో సినిమాలు చెయ్యడానికి ప్రొడ్యూసర్స్ వందల కోట్ల రూపాయిలు బడ్జెట్ కుమ్మరిస్తున్నారు..ప్రస్తుతం ప్రభాస్ మూడు సినిమాల్లో నటిస్తున్నాడు..ఈ మూడు సినిమాలకు కలిపి దాదాపుగా 1500 కోట్ల రూపాయలకు పనిగా బడ్జెట్ అవుతుంది..ఈ 1500 కోట్ల రూపాయలతో మన టాలీవుడ్ లో ఒక స్టార్ హీరో 15 కమర్షియల్ సినిమాలు తియ్యొచ్చు..అదన్నమాట ప్రస్తుతం ప్రభాస్ రేంజ్..ప్రభాస్ లైనప్ లో అభిమానులను ఆకర్షించిన సినిమా ఆది పురుష్..బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రాత్ ఈ సినిమాని మోషన్ కాప్చర్ టెక్నాలజీ తో తెరకెక్కిస్తున్నాడు..ఇండియా లో ఈ టెక్నాలజీ ని వాడడం ఇదే తొలిసారి.

    Prabhas

    ఈ చిత్రానికి సుమారు 400 కోట్ల రూపాయిల బడ్జెట్ అయ్యింది..ఈ 400 కోట్ల రూపాయిలలో మూడు వందల కోట్ల రూపాయిలు కేవలం డిజిటల్ + సాటిలైట్ రైట్స్ మరియు ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ ద్వారా కవర్ చేసింది అంటే ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు..ఈ చిత్రానికి సంబంధించిన డిజిటిల్ మరియు సాటిలైట్ రైట్స్ అన్ని భాషలకు కలిపి 250 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది.

    Also Read: Ravi Teja: ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ ని తిరిగి ఇచ్చేసిన రవితేజ

    Prabhas

    ఇది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే ఒక రికార్డు అని చెప్పొచ్చు..ఇక ఇండియన్ ప్రాంతీయ బాషలలో థియేట్రికల్ బిజినెస్ ఏ రేంజ్ లో జరుగుతుందో ఊహించుకోవచ్చు..అసలే ఉత్తరాది ప్రేక్షకులకు రాముడు అంటే విపరీతమైన భక్తి..దానికి తోడు ఆ పాత్ర ప్రభాస్ వంటి స్టార్ హీరో చెయ్యడం..ఈ రెండు అంశాలే ఈ సినిమాకి 500 కోట్ల రూపాయిలు ప్రీ రిలీజ్ బిజినెస్ వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి..ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే బాహుబలి సాధించిన 2000 కోట్ల రూపాయిల గ్రాస్ ని అతి తేలికగా బ్రేక్ చెయ్యగలడు అని అందరూ అంచనావేస్తున్నారు..మరి వారి అంచనాలను ఈ సినిమా అందుకుంటుందా లేదా అనేది చూడాలి.

    Also Read:Thank You Movie: ‘థాంక్యూ’ మూవీ ని రిజెక్ట్ చేసిన అమెజాన్ ప్రైమ్ సంస్థ.. దిల్ రాజు కి ఇది మాములు దెబ్బ కాదు

    Tags