
మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ లో ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ ఒక ప్రత్యేకమైన చిత్రం అనక తప్పదు. ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ చిత్రంలో చిరంజీవి హీరోగా , శ్రీదేవి హీరోయిన్ గా తమ పాత్రల్లో కనబరిచిన అభినయం ఈ చిత్రానికే హై లెట్ గా మారి చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్ళాయి . కాగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సోషియో ఫాంటసీ చిత్రం విడుదలై మే 9 నాటికి సరిగ్గా మూడు దశాబ్దాలైంది. ఈ సందర్భంగా ఈ సినిమా నిర్మాత, వైజయంతీ మూవీస్ అధినేత సి.అశ్వనీదత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ” స్వర్గీయ ఎన్టీఆర్ గారు నటించిన జగదేకవీరుడు వంటి సినిమాను తీయాలనుకున్నాను. నా కల `జగదేకవీరుడు అతిలోకసుందరి` రూపంలో నిజమైంది. ఈ ముప్పైఏళ్లే కాదు.. మరో ముప్పై ఏళ్లు మాట్లాడుకునే సినిమా ఇది’’ అన్నారు.
గ్యాస్ లీక్ తో రాజధాని తరలింపు సాధ్యమా!
ఈ సందర్భంగా నిర్మాత అశ్వనీదత్ జగదేకవీరుడు అతిలోక సుందరి రీమేక్ గురించి కూడా ప్రస్తావిస్తూ ‘‘కచ్చితంగా మా జగదేకవీరుడు మళ్లీ వస్తాడు. రెండో భాగం కూడా ఉంది. ఎవరు నటిస్తారు? ఎప్పుడు చేస్తాం? అనే వివరాలను త్వరలో తెలియ జేస్తాను ’’ అన్నారు.
ఇక తమ తదుపరి ప్రోజెక్టుల గురించి చెబుతూ ` వైజయంతీ మూవీస్ అనుబంధ సంస్థ అయిన స్వప్న సినిమాస్ బ్యానర్లో హను రాఘవపూడి దర్శకత్వంలో , దుల్కర్ సల్మాన్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నాం . దీంతో పాటు ఓ బేబీ ఫేమ్ నందినీ రెడ్డి దర్శకత్వంలోకూడా ఓ సినిమా ఉంటుంది. అంతే కాదు ఇంకా కొన్ని కథలను తయారు చేస్తున్నామని అశ్వనీదత్ చెప్పడం జరిగింది ..