ప్రైమ్ లో ’30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా’.. ప్రదీప్ కి 30 % వాటా !

’30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా’ అనే డిఫరెంట్ టైటిల్ తో రొటీన్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ‘ప్ర‌దీప్ మాచిరాజు’. జనవరి 29న థియేటర్లలో రిలీజైన ఈ చిన్న చిత్రం ప్రేక్షకులకు విసుగు తెప్పించినా, కలెక్షన్స్ ను మాత్రం బాగానే రాబట్టుకుంది. సినిమాకి నెగిటివ్ టాక్‌ వచ్చినా.. విడుదలైన తొలి రోజే ఈ సినిమా ఏకంగా రూ.4 కోట్ల గ్రాస్‌ సాధించి.. అందరికీ షాక్ ఇచ్చింది. యాంకర్ గా ప్రదీప్‌ కు మంచి డిమాండ్ […]

Written By: admin, Updated On : May 23, 2021 5:06 pm
Follow us on

’30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా’ అనే డిఫరెంట్ టైటిల్ తో రొటీన్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ‘ప్ర‌దీప్ మాచిరాజు’. జనవరి 29న థియేటర్లలో రిలీజైన ఈ చిన్న చిత్రం ప్రేక్షకులకు విసుగు తెప్పించినా, కలెక్షన్స్ ను మాత్రం బాగానే రాబట్టుకుంది. సినిమాకి నెగిటివ్ టాక్‌ వచ్చినా.. విడుదలైన తొలి రోజే ఈ సినిమా ఏకంగా రూ.4 కోట్ల గ్రాస్‌ సాధించి.. అందరికీ షాక్ ఇచ్చింది.

యాంకర్ గా ప్రదీప్‌ కు మంచి డిమాండ్ ఉంది అనుకున్నాం కానీ, హీరోగా కూడా మంచి మార్కెట్ ఉందా అంటూ నిర్మాతలు కూడా ఆశ్చర్యపోయారు. మొత్తానికి సినిమా ఎలా ఉన్నా.. ఈ సినిమా ప్రదీప్ కి మాత్రం హీరోగా మంచి బూస్ట్‌ ఇచ్చింది. ఇక ఈ సినిమా కోసం డిజిటల్ ప్రేక్షకులు ఎప్పటి నుండో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, తాజాగా ఈ సినిమా ఓటీటీలో వచ్చేసింది.

ప్రముఖ డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్‌ అవుతోంది. అయితే సినిమా పెట్టిన పది నిమిషాల్లోనే ఈ సినిమాని వీక్షించే ప్రేక్షకులు నిమిషాలు గడిచే కొద్దీ పెరుగుతూ పోతూ ఉన్నారట. మొత్తానికి థియేటర్లలో ఈ సినిమా చూడటం మిస్‌ అయినవాళ్లు అంతా, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాని చూస్తునట్టు ఉన్నారు.

ఇక ప్రదీప్ హీరోగా ప‌రిచ‌యం అయిన ఈ సినిమా కోసం ఎక్కువ మొత్తంలోనే రెమ్యూనరేషన్ ను తీసుకున్నాడు. ఈ సినిమాగానూ రూ. 30 లక్షలతో పాటు డిజిటల్ రైట్స్ లో ముప్పై శాతం వాటా కూడా తన రెమ్యునరేషన్ కింద తీసుకున్నాడని.. ఇప్పుడు ఓటీటీ ఇచ్చే మొత్తంలో దాదాపు ముప్పై శాతం ఎమౌంట్ ప్రదీప్ కి ఇవ్వనున్నారని తెలుస్తోంది.