Homeఎంటర్టైన్మెంట్27.08.2021 : నేటి ఎక్స్ క్లూజివ్ సినిమా సంగతులు !

27.08.2021 : నేటి ఎక్స్ క్లూజివ్ సినిమా సంగతులు !

Today Telugu Movie Updates
Today’s Exclusive Movie Updates :
Boyapati Srinu Yash
టాలీవుడ్ (Tollywood) నేటి ఎక్స్ క్లూజివ్ అప్ డేట్స్ కి వస్తే.. బాలయ్యతో ‘అఖండ’ సినిమా చేస్తున్న యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుకి బంఫర్ ఆఫర్ తగిలింది. తన తర్వాత సినిమాని ఏకంగా ‘కేజీఎఫ్’ స్టార్ యష్ తో చేయబోతున్నాడు. ఇప్పటికే యష్ కు కథ కూడా చెప్పాడు. ఆ కథ యష్ కి బాగా నచ్చింది.
Pooja Hegde Beast
టాల్ బ్యూటీ పూజ హెగ్డే తమిళ స్టార్ విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న ‘బీస్ట్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తొమ్మిదేళ్ల తర్వాత పూజా ఓ తమిళ సినిమా చేయడం విశేషమే.
Vijay Sethupathi Tapsee Annabelle Sethupathi
ఇక విజయ్ సేతుపతి, తాప్సి హీరోహీరోయిన్లుగా వస్తోన్న సినిమా ‘అనబెల్ సేతుపతి’. వచ్చే నెల 17న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు.
maha samudram movie updates
అజయ్ భూపతి ‘మహా సముద్రం’ అంటూ సముద్రానికీ .. మనిషికి మధ్య ఏదో తెలియని ఎమోషన్ చెప్పడానికి కసరత్తులు చేస్తున్నాడు. శర్వానంద్ – సిద్ధార్థ్ హీరోలుగా రాబోతున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 14వ తేదీన రిలీజ్ కానుంది.
Nayantara new movie
అన్నట్టు లేడీ సూపర్ స్టార్ నయనతార ‘ప్రేమమ్’ లాంటి క్లాసిక్ సినిమాని అందించిన దర్శకుడు ఆల్ఫోన్స్ పుత్రేన్ డైరెక్షన్ లో పృథ్వీరాజ్ హీరోగా రానున్న సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా షూట్ లో నేటి నుండి నయనతార పాల్గొంది.

 

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version