https://oktelugu.com/

Game Changer : 2 వారాల్లో 215 కోట్ల రూపాయిలు..2 రోజుల్లో రావాల్సిన వసూళ్లు ఇవి ..’గేమ్ చేంజర్’ తో రామ్ చరణ్ ఈ పాఠాలు నేర్చుకోవాల్సిందే!

ఒకప్పుడు రామ్ చరణ్ లెక్కే వేరు..ఫ్లాప్ అవ్వాల్సిన సినిమాలను సూపర్ హిట్ చేయడం..యావరేజ్ అవ్వాల్సిన సినిమాలను బ్లాక్ బస్టర్ హిట్స్ ని చేయడం..

Written By:
  • Vicky
  • , Updated On : January 24, 2025 / 02:03 PM IST
    Game Changer OTT

    Game Changer OTT

    Follow us on

    Game Changer : ఒకప్పుడు రామ్ చరణ్ లెక్కే వేరు..ఫ్లాప్ అవ్వాల్సిన సినిమాలను సూపర్ హిట్ చేయడం..యావరేజ్ అవ్వాల్సిన సినిమాలను బ్లాక్ బస్టర్ హిట్స్ ని చేయడం..సరైన సినిమా పడితే ఇండస్ట్రీ రికార్డ్స్ ని షేక్ చేయడం వంటివి ఆయన స్టైల్. అందుకే రామ్ చరణ్ ని మినిమం గ్యారంటీ హీరో, మిస్టర్ బాక్స్ ఆఫీస్ అని పిలుస్తూ ఉంటారు. అయితే ఇవన్నీ ఒకప్పుడు మాత్రమే. బ్రూస్లీ చిత్రం తర్వాత రామ్ చరణ్ స్టామినా లో చాలా మార్పులు వచ్చాయి. టాక్ వస్తే ‘రంగస్థలం’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ వస్తాయి. కలలో కూడా ఊహించని వసూళ్లు వస్తాయి. కానీ టాక్ తో సంబంధం లేకుండా భారీ వసూళ్లను రాబట్టి, అత్యధిక శాతం రికవరీ ని చేసే స్టామినా ఇప్పుడు రామ్ చరణ్ కి బాగా తగ్గిందా అనే అనుమానాలు ‘గేమ్ చేంజర్’ చిత్రాన్ని చూసిన తర్వాత తెలుస్తుంది.

    అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది రామ్ చరణ్ స్టామినా తగ్గింది అనేది కాదు. విడుదలకు ముందు ప్రమోషనల్ కంటెంట్ సరిగా లేకపోతే ఎంత పెద్ద సూపర్ స్టార్ సినిమాకి అయినా ఓపెనింగ్స్ నుండే భారీ బొక్క పడే అవకాశాలు ఉన్నాయి అనేది. ‘గేమ్ చేంజర్’ చిత్రం విడుదలకు ముందు ప్రమోషనల్ కంటెంట్ తో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. టీజర్ ని చూసిన తర్వాత ప్రతీ ఒక్కరికి ‘ఇదేంటి..పాత కాలం కాన్సెప్ట్ తో సినిమా తీసినట్టు ఉన్నారు. ఇలాంటి సినిమాలకు కాలం చెల్లిపోయింది కదా’ అని అనుకున్నారు. టీజర్ ఎలా ఉన్నా, పాటలు పెద్ద హిట్ అయ్యుంటే బాగుండేది. ఒక్కటంటే ఒక్క పాటకి కూడా యూత్ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ రాలేదు. అన్ని పాటలు ఎదో పర్వాలేదు అనే రేంజ్ లో ఉన్నాయి. ట్రైలర్ కూడా అంతే, పాత శంకర్ సినిమాలను మిక్సీ లో వేసి కొట్టినట్టుగా అనిపించింది. అందుకే ఓపెనింగ్స్ పై ప్రభావం పడింది.

    2 వారాల్లో ఈ చిత్రానికి 215 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది రామ్ చరణ్ రేంజ్ కి చాలా తక్కువ అనే చెప్పాలి. ఆయన లీగ్ లో ఉన్నటువంటి ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి హీరోలు కేవలం రెండు రోజుల్లో రాబట్టిన వసూళ్లు ఇవి. వాళ్ళతో పోలిస్తే రామ్ చరణ్ చాలా వెనకబడ్డాడు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి వారితో సమానంగా ఓపెనింగ్ వసూళ్లను రాబట్టి ఆల్ టైం రికార్డ్స్ కొట్టేవాడు రామ్ చరణ్. కానీ ఇప్పుడు కనీసం టాప్ 5 లోకి కూడా ఎంట్రీ ఇవ్వడం లేదు. రామ్ చరణ్ ఇక పాత కమర్షియల్ ఫార్ములా ని వదిలేయాలి. కొత్త తరహా కాన్సెప్ట్స్ ని ప్రోత్సహించాలి. శంకర్ లాంటి అవుట్ డేటెడ్ డైరెక్టర్స్ తో కాకుండా, ఈ తరం లో దూసుకుపోతున్న డైరెక్టర్స్ తో సినిమాలు తీయాలి. అప్పుడే ఆయన ఈ పోటీ ని తట్టుకోగలడు అంటూ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.