Top Grossing Movies : 2023 మొదలై 8 నెలలు అయిపోవస్తోంది. ఇక నాలుగు నెలలు ఉంటే కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. ఇక ఈ ఎనిమిది నెలల్లో ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలు విడుదలయ్యాయి, అలానే రాబోయే నాలుగు నెలల్లో మరి కొంతమంది స్టార్ హీరోల సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు విడుదలైన ఈ సంవత్సరం సినిమాలలో, సూపర్ హిట్ డిజాస్టర్ అనే పదాల ను పక్కన పెడితే, ఎక్కువ గ్రాస్ సంపాదించిన టాప్ టెన్ సినిమాలు మాత్రం ఇవే ..
జైలర్
మరోసారి రజినీకాంత్ స్టామినా చూపించిన చిత్రం ఇది. బ్లాక్ బస్టర్ వైపు దూసుకు వెళుతున్న ఈ సినిమా
మొదటి రోజు ఏకంగా రూ.91 .20 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఆదిపురుష్
ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణ గాధ ఆధారంగా వచ్చిన చిత్రం ‘ఆదిపురుష్’. మొదటి షో తోనే ఫ్లాప్ టాప్ తెచ్చుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.137 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అంతే కాదు ఈ సంవత్సరం బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాల్లో నెంబర్ వన్ ప్లేస్ ను దక్కించుకుంది.
పఠాన్
ఈ మధ్యకాలంలో బాలీవుడ్ సినిమాలకు మళ్లీ పూర్వ వైభోగం తెచ్చిన చిత్రం ‘పఠాన్’. షారుఖ్ ఖాన్ హీరోగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పఠాన్’ చిత్రం మొదటి రోజు వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.105 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
గదర్ 2
సన్నీ డియోల్, అమీషా పటేల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు రూ.53.50 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
వీర సింహారెడ్డి
నందమూరి బాలకృష్ణ ఈ సంవత్సరం మొదట్లో సంక్రాంతి సందర్భంగా వీర సింహారెడ్డిగా వచ్చి బాక్సాఫీస్ ని షేక్ చేశారు. యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం మొదటి రోజు రూ.50.10 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
వాల్తేరు వీరయ్య
సంక్రాంతికి వచ్చిన చిరంజీవి బాలకృష్ణ కన్నా ఒక మెట్టు ఎక్కువే ఎక్కి సూపర్ హిట్ సొంతం చేసుకున్నారు. హీరో రవితేజ కూడా ముఖ్యపాత్రలో నటించిన ఈ సినిమా మొదటి రోజు రూ.49.10 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
బ్రో
పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్రలో, సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన సినిమా బ్రో. అత్యంత తక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చినా కానీ ఈ సినిమా మొదటి రోజు రూ.48.50 కోట్ల గ్రాస్ ను రాబట్టింది.