https://oktelugu.com/

2021 Tollywood Musical Hits : టాలీవుడ్ మ్యూజికల్ హిట్స్

2021 Tollywood Musical Hits : పాట అంటే ఎలా ఉండాలి. అందంగా రాగ తాళ బద్ధంగా ఉండాలి. ఇక పాట సాహిత్యం సరళంగా మరియు అర్థవంతంగా ఉండాలి. కానీ ఈ రోజుల్లో అలాంటి పాటలు కరువయ్యాయి. అయితే, ఈ ఏడాది అలాంటి పాటలు కొన్ని వచ్చాయి. మళ్ళీ మళ్ళీ పాడుకునే ఆ పాటలు ఏమిటో చూద్దాం. నీ కళ్ళు నీలి సముద్రం : ఈ సంవత్సరం సూపర్ హిట్ పాటల్లో ఇది ఒకటి. ఉప్పెన విజయంలో […]

Written By:
  • Shiva
  • , Updated On : December 23, 2021 / 04:13 PM IST
    Follow us on

    2021 Tollywood Musical Hits : పాట అంటే ఎలా ఉండాలి. అందంగా రాగ తాళ బద్ధంగా ఉండాలి. ఇక పాట సాహిత్యం సరళంగా మరియు అర్థవంతంగా ఉండాలి. కానీ ఈ రోజుల్లో అలాంటి పాటలు కరువయ్యాయి. అయితే, ఈ ఏడాది అలాంటి పాటలు కొన్ని వచ్చాయి. మళ్ళీ మళ్ళీ పాడుకునే ఆ పాటలు ఏమిటో చూద్దాం.

    2021 Tollywood Musical Hits

    నీ కళ్ళు నీలి సముద్రం : ఈ సంవత్సరం సూపర్ హిట్ పాటల్లో ఇది ఒకటి. ఉప్పెన విజయంలో ‘నీ కన్ను నీలీ సముద్రం” పాటకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈ పాట యువతకు బాగా కనెక్ట్ అయింది. శ్రీమణి ఈ పాటను రాశాడు.

    నీలి నీలి ఆకాశం: యాంకర్ ప్రదీప్ హీరోగా వచ్చిన ”ముఫ్ఫై రోజుల్లో ప్రేమించడం ఎలా” అనే సినిమా లోది ఈ పాట. ఎంతో గొప్పగా ఆకట్టుకుంది ఈ పాట.

    మగువా మగువా: ‘వకీల్ సాబ్’ నుంచి వచ్చిన ఈ మగువ పాట కూడా సూపర్ హిట్ అయింది.

    లవ్ స్టొరీ : శేఖర్ కమ్ముల లవ్ స్టోరీలోని ‘సారంగ దరియా’ పాట రికార్డులను సాధించింది. ముఖ్యంగా ఈ పాటలో సాయి పల్లవి డ్యాన్స్ నెక్స్ట్ లెవల్ లో ఉంది.

    ఒకే ఒక లోకం : శశి సినిమా నుంచి సిద్ శ్రీ రామ్ పాడిన ‘ఒకే ఒక ప్రాణం నీవే’ పాట యూత్ ని కట్టిపడేసింది.

    జాతి రత్నం చిట్టి: జాతి రత్నాలు నుంచి ‘చిట్టి నీ వవ్వంటే’ పాట తెగ సందడి చేసింది.

    Also Read: Komuram Bheemudo Song Lyrics in Telugu and English

    కళ్యాణ మండపంలో చుక్కల చున్నీ : ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమా నుంచి వచ్చిన చుక్కల చున్నీ పాట కూడా ఆడియన్స్ కు తెగ నచ్చేసింది.

    రంగ్ దే : నితిన్ రంగ్ దే లో సిద్ శ్రీరామ్ పాడిన ‘నా కనులు ఎపుడు’ పాట మళ్ళీమళ్ళీ వినే పాట గా నిలిచింది.

    లేహరాయి : అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ లో లేహరాయి పాట కూడా బాగా అలరించింది.

    పుష్ప నుంచి రెండు: పుష్పలో రెండు పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. సూపే బంగారం.. నా సామి పాటలు అలరించాయి.

    Also Read: హీరో నాని సంచలన నిర్ణయం… ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

     

    Tags