2018 Movie Collections: ‘2018’ మొదటి వారం వసూళ్లు.. 2 కోట్లు పెట్టి కొంటే వచ్చిన లాభాలు ఎంతో తెలుసా!

అలాంటి సమయం లో డబ్బింగ్ సినిమాలే మనల్ని ఆదుకున్నాయి. రీసెంట్ గా 'బిచ్చగాడు 2 ' రూపం లో బాక్స్ ఆఫీస్ సక్సెస్ ని అందుకున్న టాలీవుడ్, ఈ చిత్రం తర్వాతి వారం లో విడుదలైన '2018' అనే మలయాళం డబ్బింగ్ సినిమా తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.

Written By: Vicky, Updated On : June 3, 2023 9:18 am

2018 Movie Collections

Follow us on

2018 Movie Collections: ఈమధ్య మన టాలీవుడ్ లో తెలుగు హీరోల సినిమాలకంటే కూడా, డబ్బింగ్ సినిమాలు తెగ ఆడేస్తున్నాయి. ఈ సమ్మర్ లో ఎంతో మంది యువ హీరోలు ప్రెస్టీజియస్ సినిమాలతో మన ముందుకు వచ్చారు కానీ, బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అయిన సినిమాలు కేవలం ‘దసరా’ మరియు ‘విరూపాక్ష’ మాత్రమే. ఈ రెండు సినిమాలు కాకుండా ‘బలగం’ లాంటి చిత్రాలు విడుదలై మంచి విజయాన్ని అందుకుంది కానీ,మిగిలిన సినిమాలన్నీ పెద్ద డిజాస్టర్స్ గా నిలిచాయి.

అలాంటి సమయం లో డబ్బింగ్ సినిమాలే మనల్ని ఆదుకున్నాయి. రీసెంట్ గా ‘బిచ్చగాడు 2 ‘ రూపం లో బాక్స్ ఆఫీస్ సక్సెస్ ని అందుకున్న టాలీవుడ్, ఈ చిత్రం తర్వాతి వారం లో విడుదలైన ‘2018’ అనే మలయాళం డబ్బింగ్ సినిమా తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ చిత్రం డబ్బింగ్ రైట్స్ ని గీత ఆర్ట్స్ మరియు ప్రముఖ నిర్మాత హరీష్ శంకర్ కొనుగోలు చేసి గత వారం లో భారీ గా విడుదల చేసారు.

గత వారం భారీ లెవెల్ లో విడుదలైన ఈ చిత్రానికి మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ వచ్చింది. ఇలాంటి సినిమాలు చూస్తే థియేటర్స్ లోనే చూడాలి అనే టాక్ బాగా వ్యాప్తి చెందడం తో, ఈ చిత్రానికి ప్రేక్షకులు థియేటర్స్ లో బ్రహ్మారథం పట్టారు. కేవలం రెండు కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ సినిమా, మొదటి వారం లో మూడు కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసింది.గ్రాస్ లెక్కలు తీస్తే దాదాపుగా 7 కోట్ల 40 లక్షల రూపాయిల వరకు ఉంటుందట. అందులో 3 కోట్ల 45 లక్షల రూపాయిల గ్రాస్ కేవలం నైజాం ప్రాంతం నుండే వచ్చింది.

థియేటర్స్ లో ఇంత విజయవంతంగా నడుస్తున్నప్పటికీ కూడా ఈ చిత్రాన్ని జూన్ 6 వ తారీఖు నుండి ఓటీటీ లో విడుదల చెయ్యడానికి సిద్ధం అవ్వడాన్ని ట్రేడ్ పండితులు తప్పుబడుతున్నారు. ఇప్పటికే మలయాళం లో ఈ సినిమా 180 కోట్ల రూపాయిల కంటే ఎక్కువ గ్రాస్ ని వసూలు చేసింది, 200 కోట్ల రూపాయిల వైపు పరుగులు తీస్తుంది. మరి ఓటీటీ లోకి వచ్చిన తర్వాత కూడా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు థియేటర్స్ లో అదే రేంజ్ లో ఆదరిస్తారో లేదో చూడాలి.