Miss Telangana: సోషల్ మీడియా వేదికగా లైవ్ వీడియో పెట్టి ఆత్మహత్య చేసుకుంటున్నా అంటూ కలకలం రేపింది మాజీ మిస్ తెలంగాణ. వెంటనే స్పందించిన ఆమె స్నేహితులు పోలీసులకు సమాచారం అందించడంతో… రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను రక్షించి ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే… నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ నగర్ రోడ్ నెంబర్ 6 లో ఓ ఫ్లాట్ లో ” హాసని ” అనే యువతి ఉంటుంది. ఈమె 2018లో మిస్ తెలంగాణగా ఎంపికయ్యారు.

అయితే అనుకోని రీతిలో ఈరోజు ఉరి వేసుకుంటున్నట్లు ఆన్ లైన్ లో ఓ వీడియో పోస్టు చేశారు. ఈ వీడియోను ఆమె స్నేహితులు చూసి… వెంటనే డయల్ 100కు సమాచారం అందించారు. దీంతో వెంటనే నారాయణ గూడ పోలీసులు స్పందించి… ఆమె నివాసం ఎక్కడో కనుక్కొని కరెక్ట్ టైమ్ కి ఆమెని కాపాడగలిగారు. అనంతరం హైదర్ గూడలోని అపోలో ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హాసిని ఆరోగ్యం క్షేమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఇటీవలే ఓ యువకుడు శారీరంగా వేధిస్తున్నాడంటూ ఆమె జూబ్లీహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్త కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. ఈమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియయాల్సి ఉంది.