Bro Movie Records
Bro Movie Records: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘బ్రో ది అవతార్’ చిత్రం ఈ నెల 28 వ తారీఖున విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ , పాటలు విడుదల అయ్యాయి. టీజర్ కి మంచి రెస్పాన్స్ రాగ , పాటలకు యావరేజి రెస్పాన్స్ వచ్చింది.
థమన్ రేంజ్ లో సాంగ్స్ లేవని, గతం లో భీమ్లా నాయక్ , వకీల్ సాబ్ చిత్రాలకు అద్భుతంగా ఇచ్చాడని, కానీ ఈ సినిమాకి అందులో పావు శాతం కూడా ఇవ్వలేదు అంటూ ఫ్యాన్స్ చాలా తీవ్ర స్థాయిలో మేకర్స్ పై మరియు థమన్ పై విరుచుకుపడ్డారు. ఒక్కటి కూడా కలిసి రావడం లేదు, ఇక సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వుధి ఏమో, పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే వరస్ట్ ఓపెనింగ్స్ దక్కించుకున్న చిత్రం గా మిగిలిపోతుందేమో అని అందరూ అనుకున్నారు.
Bro Movie Records
కానీ ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అవ్వగానే అభిమానులకే కూడా ట్రేడ్ పండితులకు కూడా దిమ్మ తిరిగే షాక్ తగిలింది. బుకింగ్స్ ప్రారంభమైన నిమిషాల వ్యవధి లోనే టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతున్నాయి. ముఖ్యంగా లండన్ లో ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కాసేపటి క్రితమే ప్రారంభించారు. బుకింగ్స్ ప్రారంభించిన 10 నిమిషాల వ్యవధిలోనే రెండు వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి.
ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ పాన్ వరల్డ్ మూవీ అనే హైప్ తో రీసెంట్ గా విడుదలైన ‘ఆదిపురుష్’ చిత్రానికి కూడా జరగలేదు. ఇక అమెరికా లో కూడా గంటకి 5 వేల డాలర్స్ లెక్కన టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. ఇది నిజంగా ఎవ్వరూ ఊహించని అద్భుతం అనే చెప్పాలి. ఎందుకంటే ట్రైలర్ కూడా రాకుండానే ఈ రేంజ్ విద్వంసం ఇప్పటి వరకు ఎక్కడా కూడా జరగలేదు. ఈ నెల 21 వ తారీఖున ట్రైలర్ విడుదలైన తర్వాత ఎవ్వరూ ఊహించని రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.