https://oktelugu.com/

This Week OTT Releases: ఈ వారం ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు, నాని, శోభిత చిత్రాలు చాలా స్పెషల్!

ఈ వారం ఓటీటీ ప్రియులకు పండగే. అన్ లిమిటెడ్ కంటెంట్ అలరించేందుకు సిద్ధమైంది. ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో నాని లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం, నాగ చైతన్యకు కాబోయే భార్య శోభిత ధూళిపాళ్ల నటించిన లవ్ సితార చాలా ప్రత్యేకం.

Written By:
  • S Reddy
  • , Updated On : September 23, 2024 / 01:33 PM IST

    This Week OTT Releases

    Follow us on

    This Week OTT Releases: ప్రతి శుక్రవారం థియేటర్స్ లో పలు కొత్త చిత్రాలు విడుదలవుతాయి. సెప్టెంబర్ 27న దేవర విడుదలవుతుండగా… ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు థియేటర్స్ కి పోటెత్తనున్నారు. ఎన్టీఆర్ నుండి ఆరేళ్ళ తర్వాత వస్తున్న సోలో చిత్రం ఆర్ ఆర్ ఆర్ అని చెప్పొచ్చు. మరోవైపు ఓటీటీ ప్రియులను అలరించేందుకు ఏకంగా 20 సినిమాలు/సిరీస్లు స్ట్రీమింగ్ కి సిద్ధమయ్యాయి.

    వీటిలో నాని నటించిన సరిపోదా శనివారం చాలా ప్రత్యేకం. దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఎస్ జే సూర్య ప్రధాన విలన్ రోల్ చేశాడు. ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ఓటీటీలో అందుబాటులోకి వస్తుంది.

    అలాగే నాగ చైతన్యకు కాబోయే భార్య శోభిత ధూళిపాళ్ల లవ్, సితార చిత్రం సైతం ఓటీటీలో స్ట్రీమ్ కానుంది. ఈ వారం ఆసక్తి రేపుతున్న మరో చిత్రం స్త్రీ 2. ఈ బాలీవుడ్ మూవీ సంచలన విజయం నమోదు చేసింది.

    వివిధ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లో ఈ వారం స్ట్రీమ్ అవుతున్న చిత్రాలు…

    పెనేలోప్(ఇంగ్లీష్ సిరీస్)- సెప్టెంబర్ 24
    బ్యాంకాక్ బ్రేకింగ్(థాయ్ సిరీస్)-సెప్టెంబర్ 26
    నో బడీ వాంట్స్ దిస్(ఇంగ్లీష్ సిరీస్)-సెప్టెంబర్ 26
    సరిపోదా శనివారం(తెలుగు సినిమా)-సెప్టెంబర్ 26
    గ్యాంగ్ సియాంగ్ క్రియేచర్ సీజన్ 2(కొరియన్ సిరీస్)-సెప్టెంబర్ 27
    రెజ్ బాల్(ఇంగ్లీష్ సినిమా)-సెప్టెంబర్ 27
    విల్ అండ్ హార్పర్(ఇంగ్లీష్ మూవీ)-సెప్టెంబర్ 27

    డిస్నీ ప్లస్ హాట్ స్టార్

    వాలా(డబ్బింగ్ మూవీ)- సెప్టెంబర్ 23
    9-1-1 లోన్ స్టార్ సీజన్ 5(ఇంగ్లీష్ సిరీస్)- సెప్టెంబర్ 24
    ఇన్ సైడ్ అవుట్(ఇంగ్లీష్ సినిమా)-సెప్టెంబర్ 25
    గ్రోటస్కైరీ(ఇంగ్లీష్ సిరీస్)-సెప్టెంబర్ 25
    అయిలా వై లాస్ మిర్రర్(స్పానిష్ సిరీస్)-సెప్టెంబర్ 27
    తాజా ఖబర్ సీజన్ 2(హిందీ సిరీస్)- సెప్టెంబర్ 27

    అమెజాన్ ప్రైమ్

    స్కూల్ ఫ్రెండ్స్ సీజన్ 2(హిందీ సిరీస్)- సెప్టెంబర్ 25
    స్త్రీ 2(హిందీ మూవీ)- సెప్టెంబర్ 27

    ఆహా

    బ్లింక్(తమిళ డబ్బింగ్ మూవీ)-సెప్టెంబర్ 25

    జీ 5

    డిమాంటీ కాలని(డబ్బింగ్ మూవీ)- సెప్టెంబర్ 27
    లవ్ సితార(హిందీ మూవీ)-సెప్టెంబర్ 27

    జియో సినిమా

    హనీ మూన్ ఫోటోగ్రాఫర్(హిందీ సిరీస్)- సెప్టెంబర్ 27

    ఆపిల్ ప్లస్ టీవీ

    మిడ్ నైట్ ఫ్యామిలీ(స్పానిష్ సిరీస్)-సెప్టెంబర్ 25