Bigg Boss 9 Agnipariksha: మరో రెండు రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) గ్రాండ్ లాంచ్ అవ్వబోతుంది. ‘అగ్ని పరీక్ష’ షో ద్వారా ఎంపికైన సామాన్యులు, అదే విధంగా సినీ సెలబ్రిటీలతో కూడిన కంటెస్టెంట్స్ లిస్ట్ మొత్తం రెడీ అయిపోయింది. గత సీజన్స్ తో పోలిస్తే ఈ సీజన్ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. అగ్ని పరీక్ష షో కూడా పెద్ద హిట్ అయ్యింది. అయితే ఈ సీజన్ కి సంబంధించిన ప్రోమో లో నవగ్రహాల కాన్సెప్ట్ అని, ఒక హౌస్ కాదు, రెండు హౌస్లు ఉంటాయని, ఏకంగా బిగ్ బాస్ ని కూడా మార్చేశామని నాగార్జున(Akkineni Nagarjuna) చెప్పిన విషయాలు ఆడియన్స్ లో ప్రత్యేకమైన ఆసక్తి ని కలిగించాయి. బిగ్ బాస్ 9 కి సంబంధించిన హౌస్ సెట్ మొత్తం రెండు రోజుల క్రితమే రెడీ అయ్యింది. ఈ హౌస్ సెట్ ని చూసిన వాళ్లకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది.
Also Read: ఘాటీ’ లో అల్లు అర్జున్.. ఫ్యాన్స్ కి ఊహించని ట్విస్ట్.. వీడియో వైరల్!
రెండు హౌస్లు అని ఒక రేంజ్ లో ఊదరగొట్టారు కదా, సామాన్యులకు ఒక హౌస్ ని నిర్మించి, సెలబ్రిటీలకు మరో హౌస్ ని నిర్మించారేమో అని అంతా అనుకున్నారు. కానీ అక్కడ అంత సినిమా లేదు. ఒకే హౌస్ లో రెండు రకాల బెడ్ రూమ్స్ ఉంటాయట. ఆ రెండో రకం బెడ్ రూమ్ నే రెండవ హౌస్ అని సమాచారం. అందులో ముందుగా సామాన్యులు ఉంటారట, అదే విధంగా మొదటి బెడ్ రూమ్ లో సెలబ్రిటీలు ఉంటారట. ఈ రెండు హౌస్లకు సంబంధించిన వాళ్లకు మొదటి రోజు నుండే నువ్వా నేనా అనే రేంజ్ అగ్గి పుట్టించే టాస్కులు ప్లాన్ చేశారట బిగ్ బాస్ టీం. సామాన్యులు సెలబ్రిటీలకు సేవకులుగా వ్యవహరించేలా కొన్ని టాస్కులు కూడా ప్లాన్ చేశాడట బిగ్ బాస్. చూస్తుంటే ఈ సీజన్ లో సామాన్యులలో ఎవరో ఒకరు టైటిల్ గెలిచేలా అనిపిస్తుంది.
ఇకపోతే ఇప్పటి వరకు ఖరారు అయిన సెలబ్రిటీల లిస్ట్ ఒకసారి చూద్దాం. రీతూ చౌదరి, తనూజ గౌడ, సుమన్ శెట్టి, భరణి, సంజన గిల్రాని, ఆశా షైనీ, ఇమ్మానుయేల్, ముకేశ్ గౌడ, శ్రేష్టి వర్మ, డెబ్జానీ తదితరులు ఖరారు అయ్యారట. పూర్తి స్థాయి కంటెస్టెంట్స్ లిస్ట్ శనివారం రోజున రానుంది. ఇక అగ్ని పరీక్ష నుండి సామాన్యుల లిస్ట్ విషయానికి వస్తే దమ్ము శ్రీజా, మాస్క్ మ్యాన్ హరీష్, నాగ ప్రశాంత్, పవన్ కళ్యాణ్ పడాలా, ప్రియా శెట్టి మరియు మర్యాద మనీష్ లు హౌస్ లోపలకు అడుగుపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.