Allu Arjun In Ghaati: లేడీ సూపర్ స్టార్ అనుష్క(Anushka Shetty) నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఘాటీ'(Ghaati Movie) రేపు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతున్న సంగతి తెలిసిందే. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. చాలా కాలం తర్వాత అనుష్క నుండి రాబోతున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇది. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన ప్రతీ కంటెంట్ ని చూస్తుంటే ‘ఒసేయ్ రాములమ్మ’ లోని విజయశాంతి క్యారక్టర్ ని అనుష్క లో చూసినట్టుగా అనిపిస్తుందంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే నేడు విడుదల చేసిన గ్లింప్స్ వీడియో కి అయితే సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఈమధ్య కాలం లో ఇలాంటి యాక్షన్ సన్నివేశాలు లేవు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. చూస్తుంటే క్రిష్ ఈసారి కుంభస్థలం బద్దలు కొట్టేలాగానే ఉన్నాడు.
Also Read: అల్ల నరేష్ ‘అల్కహాల్’.. ఇదేంటి భయ్యా ఇలా చేశాడు…
ఇదంతా పక్కన పెడితే అనుష్క ఈ సినిమాని ప్రమోట్ చేసే విషయం లో ఆమె సరికొత్త ట్రెండ్ ని క్రియేట్ చేసింది. సాధారణంగా ప్రొమోషన్స్ అంటే కెమెరాల ముందుకొచ్చి ఇంటర్వ్యూస్ ఇవ్వడం, లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం వంటివి మాత్రమే కాదు, ఇలా కూడా ప్రమోట్ చేయొచ్చు అని నిరూపించింది అనుష్క. ఫోన్ కాల్స్ తోనే ఆమె మీడియా తో సంభాషిస్తుంది. అదే విధంగా FM రేడియో లో కూడా ఆమె రీసెంట్ గానే ఈ చిత్రం గురించి మాట్లాడింది. ఇదంతా పక్కన పెడితే తన తో ఎంతో క్లోజ్ గా ఉండే పాన్ ఇండియన్ స్టార్స్ తో ఈ చిత్రాన్ని స్వయంగా ఆమె ప్రమోట్ చేయిస్తుంది. రెండు రోజుల క్రితమే దగ్గుబాటి రానా అనుష్క తో ఫోన్ కాల్ సంభాషణ జరిపిన ఆడియో రికార్డు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ఇక నేడు ఉదయం రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమాకు సంబంధించిన రెండవ గ్లింప్స్ వీడియో ని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ప్రమోట్ చేయించాడు. అదే విధంగా కాసేపటి క్రితమే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) కూడా అనుష్క తో ఈ ఘాటీ సినిమా గురించి 6 నిమిషాల ఫోన్ కాల్ సంభాషణ జరిపాడు. దీనిని విన్న ఆడియన్స్ చాలా సర్ప్రైజ్ కి గురయ్యారు. గతం లో వీళ్లిద్దరు కలిసి వేదం, రుద్రమదేవి లో నటించారు. ఈ రెండు సినిమాలు కూడా ఇద్దరికీ మంచి పేరు తీసుకొచ్చింది. ఆ పాత జ్ఞాపకాలను తల్చుకుంటూ, ఘాటీ సినిమా గురించి ఇద్దరు మాట్లాడుకుంటూ చాలా ఫన్నీ గా సాగిపోయిన ఈ ఫోన్ కాల్ సంభాషణను మీరు కూడా వినేయండి.
Pushpa Raj For Sheelavathi!! pic.twitter.com/VzIwxyd040
— Aakashavaani (@TheAakashavaani) September 4, 2025