Aadipurush : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటిస్తున్న ఆదిపురుష్ మూవీ వచ్చే నెల 16 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా అన్నీ ప్రాంతీయ బాషలలో విడుదల కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా, దానికి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.అంతే కాకుండా ‘జై శ్రీ రామ్’ లిరికల్ వీడియో సాంగ్ కూడా మంచి హిట్ అయ్యింది.బయట ఎక్కడ చూసిన ఈ పాటనే వినిపిస్తుంది,జూన్ 6 వ తారీఖున హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరగనుంది.
అప్పటి నుండి ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ లో చురుగ్గా పాల్గొనబోతున్నారు ప్రభాస్. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో ప్రారంభం అయ్యింది, రెస్పాన్స్ అదిరిపోయింది, త్వరలోనే ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానుంది.
ఇది ఇలా ఉండగా ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో యూవీ క్రియేషన్స్ సంస్థ కొనుగోలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే వాళ్ళ గత రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా దెబ్బ తిన్న కారణం గా బయ్యర్స్ నుండి తీవ్రమైన ఒత్తిడి ఎదురైంది. పాత డబ్బులు సెటిల్ చెయ్యాలని, లేకపోతే ఆదిపురుష్ చిత్రాన్ని తక్కువ రేట్స్ కి అమ్మాలని ఒత్తిడి చేసారు.
దీనితో యూవీ క్రియేషన్స్ ఈ చిత్రం ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ హక్కుల నుండి తప్పుకొని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కి 170 కోట్ల రూపాయలకు అమ్మేసింది, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్స్ కి పలికే రేట్ మారిపోయింది. ఒక్క రాజమౌళి సినిమాకి తప్ప మన తెలుగు రాష్ట్రాల్లో 150 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ థియేట్రికల్ ఏ చిత్రానికి కూడా జరగలేదు, ఒక్క ప్రభాస్ ఆదిపురుష్ చిత్రానికి మాత్రమే జరిగింది. మరి ఈ సినిమా ఫుల్ రన్ లో రికవరీ చేస్తుందా లేదా అనేది చూడాలి.