https://oktelugu.com/

Roshan Kanakala: ముద్దు సీన్ కోసం 150 టేక్స్… యాంకర్ మీద ఫైర్ అయిన సుమ కొడుకు!

సుమ కనకాల కొడుకువు కాబట్టే చిరంజీవి బబుల్ గమ్ చిత్రాన్ని ప్రమోట్ చేశారా? అని యాంకర్ అడిగారు. అలాంటిదేమీ లేదు. ఆయన ఎప్పుడు అలా చేయరు. చిరంజీవికి టీజర్ బాగా నచ్చింది.

Written By:
  • NARESH
  • , Updated On : December 13, 2023 10:13 am
    Follow us on

    Roshan Kanakala: యాంకర్ సుమ-రాజీవ్ కనకాల వారసుడు రోషన్ కనకాల సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. రోషన్ హీరోగా బబుల్ గమ్ టైటిల్ తో రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ తెరకెక్కింది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో రోషన్ విరివిగా పాల్గొంటున్నారు. సుమ, రాజీవ్ లకు పరిశ్రమలో పలుకుబడి ఉంది. దీంతో చిరంజీవితో పాటు పలువురు సెలబ్రిటీలు బబుల్ గమ్ చిత్రాన్ని ప్రోమోట్ చేస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో రోషన్ కి కొన్ని ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి.

    సుమ కనకాల కొడుకువు కాబట్టే చిరంజీవి బబుల్ గమ్ చిత్రాన్ని ప్రమోట్ చేశారా? అని యాంకర్ అడిగారు. అలాంటిదేమీ లేదు. ఆయన ఎప్పుడు అలా చేయరు. చిరంజీవికి టీజర్ బాగా నచ్చింది. సాంగ్ కూడా నచ్చింది. నా వాయిస్ చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఆయన నన్ను పొగిడేసరికి ఆశ్చర్యం కలిగిందని రోషన్ సమాధానం చెప్పారు.

    ఎన్టీఆర్ తో మీ నాన్న రాజీవ్ కనకాలకు విభేధాలు తలెత్తాయని అంటారు? దీనిపై నీ అభిప్రాయం ఏంటని అడిగారు. నాకు తెలిసి ఎన్టీఆర్ తో నాన్నకు ఎలాంటి గొడవలు లేవు. ఇప్పుడు అప్పుడు వాళ్ళు కలిసే ఉన్నారు. స్టూడెంట్ నెంబర్ 1 నాటి నుండి వారి మధ్య స్నేహం ఉంది. మంచి ఫ్రెండ్ ని వదులుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. ఎన్టీఆర్ తో నాన్నకు గొడవలు లేవని చెప్పగలను, అన్నాడు రోషన్.

    ఈ సినిమాలో ముద్దు సీన్ కోసం 150 టేక్స్ తీసుకున్నారట కదా? అని అడగ్గా రోషన్ ఆగ్రహానికి గురయ్యాడు. అక్కడి నుండి లేచివెళ్లి ఆ చిత్ర హీరోయిన్ మానస చౌదరిని తీసుకువచ్చాడు. ఎన్ని టేక్స్ తీసుకున్నానని నేరుగా అడిగాడు. అయితే ఇదంతా ఫన్ లో భాగమే నిజంగా రోషన్ ఆగ్రహానికి గురి కాలేదు. బబుల్ గమ్ మూవీలో లిప్ లాక్ సీన్స్ కూడా ఉన్నాయి. ఈ చిత్రం డిసెంబర్ 29న విడుదల కానుంది.