Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu Rejected Movies: మ‌హేశ్ బాబు వ‌ద్ద‌న్న 13 సినిమాలు ఇవే.. అన్నీ సూపర్...

Mahesh Babu Rejected Movies: మ‌హేశ్ బాబు వ‌ద్ద‌న్న 13 సినిమాలు ఇవే.. అన్నీ సూపర్ హిట్‌..!

Mahesh Babu Rejected Movies: ప్రిన్స్ నుంచి సూప‌ర్ స్టార్‌గా ఎదిగాడు మ‌హేశ్ బాబు. కాగా ఆయ‌న ఇలా సూప‌ర్ స్టార్‌గా ఎద‌గ‌డానికి ఆయ‌న రెక్క‌ల క‌ష్టం ఉంది. ఎంతో ఆలోచించి ప్ర‌తి సినిమాలో త‌న‌ను తాను నిరూపించుకుంటూ ముందుకు వెళ్తున్నాడు మ‌హేశ్ బాబు. అయితే ఆయ‌న త‌న కెరీర్ లో ఓ 13 సినిమాల‌ను వ‌దులుకున్నారు. కాగా ఆ సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి కూడా. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Mahesh Babu Rejected Movies
Mahesh Babu Rejected Movies

మొద‌ట‌గా య‌మ‌లీల సినిమాతో మ‌హేశ్‌ను హీరోగా ఎంట్రీ ఇవ్వాల‌ని కృష్ణ అనుకున్నాడంట‌. అయితే అప్ప‌టికి మ‌హేశ్ చ‌దువుకుండ‌టంతో.. టైమ్ తీసుకుందామ‌ని కృష్ణ ఆ సినిమాను వ‌ద్ద‌న్నాడంట‌. దీంతో డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి అలీతో తీసి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టాడు. ఇక నువ్వేకావాలి మూవీకి మ‌హేవ్‌ను అడిగారంట‌. కానీ ఎలాంటి రెస్పాన్స్ రాక‌పోవ‌డంతో త‌రుణ్ తో తీశారు. ఇది ఏకంగా త‌రుణ్ ను స్టార్ హీరోగా నిల‌బెట్టింది.

Mahesh Babu Rejected Movies
Yamaleela Movie

ఇక ఇడియ‌ట్ మూవీ కోసం ముందుగా పూరి హీరోగా మ‌హేశ్ ను అనుకున్నాడంట‌. కానీ మ‌హేశ్ వ‌ద్ద‌న‌డంతో ర‌వితేజ చేతుల్లోకి వెళ్లి సూప‌ర్ హిట్ కొట్టింది. ఇక ఉద‌య్‌కిర‌ణ్ కు పెద్ద హిట్ ఇచ్చిన మనసంతా నువ్వే మూవీ కూడా ముందుగా మ‌హేవ్‌కు వినిపించాడంట ఎమ్ ఎస్ రాజు. కానీ డేట్స్ లేక‌పోవ‌డంతో వ‌ద్ద‌న్నాడంట‌. ఇది కూడా పెద్ద హిట్‌.

Mahesh Babu Rejected Movies
Nuvve Kavali Movie

ఇక దాదాపు ఏడుగురు హీరోలు రిజెక్ట్ చేసిన మూవీ గజిని. ఈ ఏడుగురిలో మ‌హేశ్‌ కూడా ఉన్నారంట‌. అయితే ఇది ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో తెలిసిందే. శేఖ‌ర్ క‌మ్ముల తీసిన లీడ‌ర్ మూవీకి ముందుగా మ‌హేశ్ కు చెప్తే.. ఇందులో క‌మ‌ర్షియ‌ల్ సీన్లు ఉండాల‌ని కోరాడంట‌. కానీ అందుకు శేఖ‌ర్ ఒప్పుకోక రాణాతో తీసి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టాడు. దీంతో పాటే ఏమాయ చేసావే, రుద్రమదేవి మూవీల‌కు ముందుగా మ‌హేశ్‌ను అడిగారంట‌. కానీ ఆయ‌న డేట్స్ కార‌ణంగా కుద‌ర‌లేదు. ఇవి కూడా పెద్ద హిట్‌.

Mahesh Babu Rejected Movies
Idiot Movie

అఆ మూవీని ముందుగా మ‌హేశ్ తో చేయాల‌నుకున్నాడంట త్రివిక్ర‌మ్‌. క‌థ బాగున్నా.. డేట్స్ అడ్జ‌స్ట్ కాక వ‌దులుకున్నాడంట‌. మ‌రోసారి శేఖ‌ర్ క‌మ్ముల ఫిదా మూవీ కోసం మ‌హేశ్ ను సంప్ర‌దిస్తే ఈసారి కూడా నిరాశే ఎద‌ర‌యింది. అది కూదా పెద్ద హిట్. ఇక విక్ర‌మ్ కుమార్ తీసిన గ్యాంగ్ లీడర్ ను మ‌హేశ్ తో తీయాల‌నుకున్నాడంట‌. కానీ కుద‌ర‌క అది నానితో తీసి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్నాడు. దీంతో పాటే రీసెంట్ గా వ‌చ్చి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న పుష్ప మూవీని కూడా ముందుగా మ‌హేశ్ తో తీయాల‌నుకున్నాడంట సుకుమార్‌.

Mahesh Babu Rejected Movies
Manasantha Nuvve Movie

Also Read: రెండు తరాల విలక్షణ నటుడు జగపతిబాబు !

కానీ అలాంటి పాత్ర చేస్తే బాగోద‌ని మ‌హేశ్ వ‌ద్ద‌న్నాడంట‌. దీంతో అల్లు అర్జున్ తో తీయ‌గా.. అత‌ను ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరో అయిపోయాడు. ఒక‌వేళ వీటిల్లో గ‌న‌క మ‌హేశ్ చేసి ఉంటే ఇంకా పెద్ద ఇమేజ్ వ‌చ్చి ఉండేదోమో. కానీ ప్ర‌తి హీరో త‌మ విజ‌న్‌కు త‌గ్గ‌ట్టే సినిమాలు చేస్తుంటారు. బాడీ లాంగ్వేజ్‌, క‌థ త‌మ‌కు సెట్ కాక‌పోతే ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంద‌నే రిజెక్ట్ చేస్తుంటారు.

Mahesh Babu Rejected Movies
Ghajini Movie

Also Read: ఒక్క సీన్ కోసమే ఏకంగా 60 కోట్లు.. ప్రభాస్ సినిమా రికార్డ్ !

 

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

2 COMMENTS

Comments are closed.

RELATED ARTICLES

Most Popular