HBD Jagapathi Babu: జగపతిబాబు.. ఆరు పదుల వయసులో పడిలేచిన కెరటం.. టాలీవుడ్ ఫ్యామిలీ హీరో నుంచి బలమైన విలన్ అనిపించుకుంటున్న ఏకైక హీరో. నేడు జగపతిబాబు పుట్టినరోజు. రొమాంటిక్ హీరోగా ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుని, ఆ ఇమేజ్ ను ఇరవై ఐదేళ్లు బ్యాలెన్స్ చేసి… రెండు తరాల మహిళలకు కలల రాకుమారుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకుని.. ఇప్పుడు విలన్ గా కూడా తనదైన మార్క్ తో దూసుకువెళ్తున్న నిజమైన హీరో.

జగపతిబాబు అంటే.. భవిష్యత్తు తరాల నటులకు కూడా గొప్ప ప్రేరణ. మీకు తెలుసా ? మొదట జగపతిబాబు గొంతు బాలేదు.. డబ్బింగ్ కూడా చెప్పుకోలేడు అని హేళన చేశారు. కానీ ఇప్పుడు అదే వాయిస్‌తో డైలాగులు చెప్తుంటే అబ్బో వావ్ అంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు. అసలు జగపతిబాబుకి నటన రాదు అన్నారు. కానీ ఇప్పుడు తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా మోస్ట్ వాంటెడ్ నటుడు అయిపోయాడు.
ఇక జగపతిబాబు 1962, ఫిబ్రవరి 12న జన్మించారు. కాగా తన బర్త్ డే సందర్భంగా సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అవయవదాన అవగాహన సదస్సుకు జగపతిబాబు వచ్చారు. అయితే ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అవయదానం చేసినవాళ్లకు కూడా పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు ప్రకటించాలని జగపతిబాబు చెప్పడం గొప్ప విషయం. జగపతి బాబు 90ల్లో అనేక కుటుంబ కథా చిత్రాల్లో నటించి సంచలన విజయాలు అందుకున్నారు.

Also Read: మహేశ్ బాబు వద్దన్న 13 సినిమాలు ఇవే.. అన్నీ సూపర్ హిట్..!
అలాగే గాయం, మనోహరం లాంటి సినిమాలతో నటుడిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక తొలి సినిమాలోనే ద్విపాత్రాభినయం చేసిన మొదటి నటుడు కూడా జగపతిబాబు కావడం విశేషం. ముఖ్యంగా ఎస్. వి. కృష్ణారెడ్డి, జగపతి బాబు కాంబినేషన్లో వచ్చిన మావిచిగురు, పెళ్ళి పీటలు మొదలైన చిత్రాలు కూడా ప్రేక్షకాదరణ పొందాయి.
అసలు జగపతిబాబు అంటే ఒక్క సినిమాలే కాదు, గ్రేట్ ఆధ్యాత్మిక వ్యక్తి కూడా. ఏది ఏమైనా తెలుగుతెరపై చెరిగిపోని ముద్రవేశాడు జగపతిబాబు. లెజండరీనిర్మాత వారసత్వాన్ని అందిపుచ్చుకుని.. తెలుగు స్టార్ హీరోల్లో ఒకడిగా జగపతిబాబు విజయవంతం అయ్యాడు. మా ఓకే తెలుగు తరపున జగపతిబాబుకి ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు.
Also Read: ఒక్క సీన్ కోసమే ఏకంగా 60 కోట్లు.. ప్రభాస్ సినిమా రికార్డ్ !
[…] Also Read: రెండు తరాల విలక్షణ నటుడు జగపతిబాబు ! […]