https://oktelugu.com/

Bigg Boss 5 Telugu: నామినేషన్ల పర్వం షురూ… ఎవరెవరు ఉన్నారంటే..!

Bigg Boss 5 Telugu: సోమవారం వచ్చిందంటే చాలు రచ్చ రంబోలా అవుతుంది. హౌస్ లో నామినేషన్ల ప్రక్రియ చినిగి చాటవుతోంది. గొడవలు, కొట్లాటలు, ఆగ్రహ జ్వాలలు.. ఇలా కొట్టుకోవడం ఒకటే తక్కువ అన్నట్టుగా సాగుతోంది. హౌస్ లో ఎమోషన్స్ పీక్ స్టేజ్ కి చేరుకుంటుండగా.. ప్రేక్షకులకు మాత్రం కావాల్సినంత మజా పంచుతోంది. బిగ్ బాస్ లో (Bigg Boss) అన్నింటికంటే పెద్ద టాస్క్ నామినేషన్స్. బాగా ఆడినా, ఆడకపోయినా.. నవ్వించినా.. నవ్వించకపోయినా.. ఏ చిన్న తప్పు […]

Written By:
  • NVN Ravali
  • , Updated On : November 22, 2021 10:58 am
    Follow us on

    Bigg Boss 5 Telugu: సోమవారం వచ్చిందంటే చాలు రచ్చ రంబోలా అవుతుంది. హౌస్ లో నామినేషన్ల ప్రక్రియ చినిగి చాటవుతోంది. గొడవలు, కొట్లాటలు, ఆగ్రహ జ్వాలలు.. ఇలా కొట్టుకోవడం ఒకటే తక్కువ అన్నట్టుగా సాగుతోంది. హౌస్ లో ఎమోషన్స్ పీక్ స్టేజ్ కి చేరుకుంటుండగా.. ప్రేక్షకులకు మాత్రం కావాల్సినంత మజా పంచుతోంది.

    Bigg Boss 5 Telugu

    Bigg Boss 5 Telugu

    బిగ్ బాస్ లో (Bigg Boss) అన్నింటికంటే పెద్ద టాస్క్ నామినేషన్స్. బాగా ఆడినా, ఆడకపోయినా.. నవ్వించినా.. నవ్వించకపోయినా.. ఏ చిన్న తప్పు చేసినా.. చేయకున్నా సరే కంటెస్టెంట్లు కారణాలు చూపి నామినేట్ చేయాల్సి ఉంటుంది. హౌస్ లోని అందరూ దీన్ని భరించాల్సిందే. ఎప్పుడో ఒకప్పుడు నామినేట్ కావాల్సిందే. ప్రతి సోమవారం దీన్ని చేపడతారు. అదే రోజు హౌస్ రసాభాసగా సాగుతుంది.

    ఇప్పటికే బిగ్ బాస్ నుండి పదకొండు మంది కంటెస్టెంట్లు (సరయు, ఉమాదేవి, లహరి షారి, నటరాజ్ మాస్టర్, హమీదా, శ్వేతా వర్మ, ప్రియా, లోబో, విశ్వ, జెస్సీ, అని మాస్టర్ ) ఎలిమినేట్ అయ్యారు. మరి పన్నెండో వారానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ నిన్ననే (ఆదివారం) అయిపోయిందని తెలుస్తుంది. అయితే తాజా గా జరుగుతున్న లీకుల ప్రక్రియలో పన్నెండో వారానికి గాను నామినేట్ అయిన హౌస్ మేట్స్ ఎవరో ముందుగానే తెలిసిపోయింది. అలా పన్నెండో వారానికి ఇంటి నుండి బయటకి వెళ్ళడానికి గానూ కెప్టెన్ మానస్ మినహియించి మిగతా ఇంటి సభ్యులు షన్ను, సన్నీ, కాజల్, సిరి, ప్రియాంకా సింగ్, శ్రీరామచంద్ర, యాంకర్ రవి నామినేట్ అయ్యినట్లు తెలుస్తుంది. మరి ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం తెలుసుకోవాలంటే వచ్చే ఆదివారం వరకు ఎదురు చూడాల్సిందే.

    Tags