OG Movie Pre-release theatrical Business : కేవలం ఆ ఒక్క ప్రాంతం నుండే 70 కోట్లు..షూటింగ్ పూర్తి కాకముందే ‘దేవర’ ని లేపేసిన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’!

దేవర' చిత్రానికి ఆంధ్ర + సీడెడ్+ నైజాం ప్రాంతాలకు కలిపి 112 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరగగా, 'ఓజీ' చిత్రానికి కేవలం ఆంధ్ర ప్రదేశ్+ సీడెడ్ లోనే వంద కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగిందంటే పవన్ కళ్యాణ్ కి ఉన్నటువంటి క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

Written By: Vicky, Updated On : October 30, 2024 10:19 pm

OG Movie Pre-release theatrical Business

Follow us on

OG Movie Pre-release theatrical Business :  ప్రస్తుతం మన టాలీవుడ్ నుండి తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రాలలో ప్రేక్షకుల్లోనూ, అభిమానుల్లోనూ భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రం ‘ఓజీ’. పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రారంభ దశ నుండే అంచనాలు తారా స్థాయిలో ఏర్పడింది. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా నుండి గత ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లిమ్స్ వీడియో కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ నుండి రీమేక్ సినిమాలు చూసి విసిగిపోయిన అభిమానులు ఒక్కసారిగా ఆయన నేటి తరం యూత్ ఆడియన్స్ కి తగ్గ సినిమా చేస్తుండడంతో ‘ఓజీ’ చిత్రం పై ప్రాణాలు పెట్టేసుకున్నారు.

ముఖ్యంగా ఉపముఖ్యమంత్రి స్థానంలో పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా అభిమానులు ‘ఓజీ..ఓజీ’ అని అరుస్తుండడాన్ని మనమంతా గమనించొచ్చు. పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాకి ఉన్న క్రేజ్ ని చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇది ఇలా ఉండగా ఇప్పటికీ విడుదల తేదీ కూడా ఖరారు కానీ ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కనీవినీ ఎరుగని రేంజ్ లో జరుగుతుంది. కేవలం ఆంధ్ర ప్రాంతం (సీడెడ్ కాకుండా) నుండి ఈ సినిమా బిజినెస్ 70 కోట్ల రూపాయలకు పైగా జరిగిందని సమాచారం. అలాగే నైజాం ప్రాంతంలో జీఎస్టీ కాకుండా 46 కోట్ల రూపాయలకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమా హక్కులను పొందాడు. ఇక సీడెడ్ రైట్స్ ని 30 కోట్ల రూపాయలకు అడుగుతున్నారట. అలా ఈ చిత్రానికి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ కి కలిపి 140 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగిందని చెప్తున్నారు ట్రేడ్ పండితులు.

‘దేవర’ చిత్రానికి ఆంధ్ర + సీడెడ్+ నైజాం ప్రాంతాలకు కలిపి 112 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరగగా, ‘ఓజీ’ చిత్రానికి కేవలం ఆంధ్ర ప్రదేశ్+ సీడెడ్ లోనే వంద కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగిందంటే పవన్ కళ్యాణ్ కి ఉన్నటువంటి క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కేవలం ఈ చిత్రానికి మాత్రమే కాదు, ఆయన నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి కూడా భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరుగుతుందని సమాచారం. కేవలం ఒక్క నార్త్ అమెరికా లోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 6 మిలియన్ డాలర్లకు జరిగిందని సమాచారం. ఇది ఓజీ చిత్రం బిజినెస్ కంటే ఎక్కువ అని చెప్పొచ్చు. అలాగే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో కూడా బిజినెస్ కళ్ళు చెదిరే రేంజ్ లో జరుగుతుందట. పవన్ కళ్యాణ్ నేటి తరం ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగా, పాన్ ఇండియన్ చిత్రాలు చేస్తే ఎలా ఉంటుందో ఇది ఒక ఉదాహరణ అని ఆయన అభిమానులు సోషల్ మీడియా లో గర్వంగా చెప్పుకుంటున్నారు.