విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా సినిమా ‘వరల్డ్ ఫేమస్ లవర్’. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లు నటించారు. ఓ రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమాలో విడుదలైన పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో మొదటి పాటను విడుదల చేశారు చిత్ర యూనిట్. ‘మై లవ్’ అంటూ సాగే ఈ పాటను శ్రీకృష్ణ, రమ్య బెహెర పాడారు. ఇక గోపి సుందర్ సంగీతం అందించిన ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై వల్లభ నిర్మించారు.
