Homeఎంటర్టైన్మెంట్నాగ చైతన్య నిర్మాతగా రాజ్ తరుణ్ చిత్రం

నాగ చైతన్య నిర్మాతగా రాజ్ తరుణ్ చిత్రం


ప్రస్తుతం తెలుగు యువ హీరోల్లో చాలామంది నిర్మాతలుగా మారుతున్నారు. నాని , విజయ్ దేవరకొండ , ఎన్ టి ఆర్ , మహేష్ బాబు , రానా , రామ్ చరణ్ వంటి హీరోలు ఇప్పటికే సినిమాలు తీయడం లేదా భాగస్వాములుగా సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఆ లిస్ట్ లోకి నాగ చైతన్య కూడా చేర బోతున్నాడు .నిజానికి నాగచైతన్య , సమంత ఆర్టిస్టులుగా బిజీగా ఉండి, వరుస విజయాలతో దూసుకు పోతున్నారు. అయినప్పటికీ వాళ్లిద్దరూ కలిసి సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసి సినిమాలు తీయాలను కొంటున్నారు .

వైన్ షాపులో ఉపాధ్యాయుల డ్యూటీపై పవన్ సీరియస్!

ఇంతకూ ముందు సమంత సమర్పణ లో ` యూ టర్న్` వచ్చింది .ఇక ఇపుడు నేరుగా భర్త తో కలిసి సొంత బ్యానర్ ఏర్పాటు చేసి సినిమాలు తీయాలను కొంటున్నారు . ఆ క్రమంలో తీయబోయే తొలిచిత్రం లో హీరోగా రాజ్ తరుణ్ ఛాన్స్ ఇవ్వడం జరిగింది. గతంలో ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ సినిమాను తెర కెక్కించిన దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డి ఇపుడు మరో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఆ క్రమంలో తాజాగా నాగ చైతన్య , సమంతలకు ఒక కథను వినిపించాడట. ఆ కథ వాళ్ళకి నచ్చడం తో తమ సొంత బ్యానర్లో తొలి చిత్రంగా నిర్మించడానికి నాగ చైతన్య, సమంత అంగీకరించినట్టు తెలుస్తోంది.కరోనా లాక్ డౌన్ పరిస్థితులు చక్కబడ్డాక ఈ సినిమాకి సంబంధించిన పనులు మొదలుకానున్నట్టు తెలుస్తోంది .

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular