పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలకు రీ ఎంట్రీ ఇచ్చాడు. వరుస సినిమాలకు కమిటైపోతూ బీజీగా మారాయి. ఏడాదికో సినిమా పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ తర్వాత జోరుగా చూపించబోతున్నారు. ఒకేసారి నాలుగైదు సినిమాలను గతంలో ఒప్పుకున్న దాఖాలాలు లేవు. కొన్ని సినిమాలకు ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది. మరికొన్ని పట్టాలెక్కాల్సి ఉంది. అయితే పవన్ కల్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ డైరెక్టర్ బాబీతో కలిసి పని చేయనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లలో గతంలో వచ్చిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ అనుకున్నంత విజయం దక్కించుకోలేదు. దీంతో బాబీకి మరో చాన్స్ ఇవ్వాలని పవన్ భావిస్తున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ కూడా పట్టాలెక్కబోతుందని ప్రచారం జరుగుతుంది.
పవన్ రీ ఎంట్రీ మూవీ ‘పింక్’ తెలుగు వర్షన్ కు ‘లాయర్ సాబ్’ అనే టైటిల్ ఖరారైనట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ మూవీకి తాజాగా ‘వకీల్ సాబ్’ అనే పేరు తెరపైకి వచ్చింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఈ టైటిల్ ను నిర్మాత దిల్ రాజు రిజిష్ట్రేషన్ చేయించినట్లు తెలుస్తోంది. అలాగే పవన్ కల్యాన్ క్రిష్ దర్శకత్వంలో ఓ పిరియాడికల్ మూవీలో నటించనున్నారు. ఇందులో బందిపోటు పాత్రలో పవన్ నటించనున్నారు. అలాగే పవన్ కల్యాణ్ కి ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్టు అందించిన దర్శకుడు హరీష్ శంకర్ తో మరోసారి పని చేయనున్నాడు. ఈ మూవీపై ఫ్యాన్స్ ఇప్పటికే భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఈ మూడు సినిమాలతోపాటు పవన్ ఇంకో రెండు సినిమాలను ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా పవన్ ఐదు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతుంది. ఇందులో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ ఉండనుందని తెలుస్తోంది. అలాగే ‘సర్దార్’ దర్శకుడికి మరోసారి చాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా వరుస సినిమాలతో పవన్ టాలీవుడ్ పై దండయాత్రకు దిగుతుతున్నాడు. దీంతో పవన్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.