
ప్రస్తుత కాలంలో ఫోన్ చూడడం వ్యసనంగా మారిపోయింది. పక్కన ఎవరున్నారన్నది పట్టించుకోవడం లేదు. ఐతే జామీ క్లార్క్ తన కుమారుడు ఖోభేను ఫోన్ వ్యసనం నుండి ఎలా తప్పించాడో తెలిస్తే అశ్చర్యపోతారు. కెనడాకు చెందిన జామీ తన కుమారుడిని ఫోన్ అలవాటు నుండి తప్పించి, కుటుంబ సభ్యులతో కలిసేలా చేసేందుకు ఒక ఆలోచన చేసి దానిని అమలు చేసాడు. కుమారునితో పాటు మంగోలియా ట్రిప్ కు ప్లాన్ చేసాడు. నెల్లాళ్ళ పాటు సాగే ఈ యాత్ర లో 2200 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ సమయంలో కొడుకు ఫోన్ వాడకుండా చూసాడు. కాగా జామీ గతంలో రెండుసార్లు ఎవరెస్ట్ ఎక్కాడు. ఇంటర్నెట్ కన్నా ఇవి ఎంతో గొప్పవని కొడుకుకు చెప్పాడు. ప్రకృతి అందాలను చూపిస్తూ ప్రపంచం తిప్పాడు . ఈ సందర్భంగా ఖోభే మాట్లాడుతూ ఈ ట్రిప్ కారణంగా ఫోన్ కన్నా గొప్ప విషయాలు ఉన్నయని తెలుసుకున్నానని అన్నాడు