డిజిటల్ ప్లాట్ ఫామ్ కి బంగారు భవిష్యత్తు ఉందనేది ఇప్పటికే ఓటీటీల విశేష ఆదరణతో అఖండ ప్రేక్షక లోకానికి కూడా అవగతమైపోయింది. పైగా ఓటీటీలలో రోజురోజుకూ పోటీ పెరిగిపోతూ ఉంది. తెలుగులో ఒక్క ‘ఆహా’ తప్ప మరో ఓటీటీ ప్లాట్ ఫామ్ లేదు. అయినా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఓటీటీల నుండి గట్టి పోటీనే ఎదురవుతూ ఉంది. తెలుగు ప్రేక్షకులు కూడా ఎక్కువగా అమెజాన్, నెట్ ఫ్లిక్స్, జీ 5, హాట్ స్టార్ లాంటి వాటి పైనే ఎక్కువ మక్కువ పెంచుకుంటున్నారు.
మన తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా సక్సెస్ అయినా.. ఇప్పటికీ దాని పై చిన్న చూపే ఉంది. అయితే గత రెండు నెలలు నుండి ఆహాను ఎక్కువమంది వాడుతున్నారు. దానికి కారణం కంటెంట్ లో వైవిధ్యమే. తమ కస్టమర్స్ ఇష్టాలకు అనుగుణంగా ఆహా ఓటిటి సంస్థ కూడా ఒరిజినల్ కంటెంట్ పై ఫోకస్ పెట్టింది. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ లాంటి సంస్థలు ఎలా అయితే స్వయంగా ఆయా భాషల్లో పలు వెబ్ సిరీస్‌లను నిర్మించి.. కస్టమర్స్ ను పెంచుకుంటూ మంచి లాభాలు గడిస్తున్నాయో అలాగే ఆహా కూడా ప్లాన్ చేస్తోంది.
సో.. తెలుగు ఓటిటిలో కూడా ఒరిజినల్ కంటెంట్ పై ఫోకస్ పెడితే.. కచ్చితంగా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. డబ్బింగ్ సినిమాలు బాగుంటేనే తెలుగు వాళ్ళు దాన్ని హిట్ చేసే వరకూ నిద్రపోరు. అందుకే, ఆహా మొత్తానికి మంచి కంటెంట్ ను పేరున్న నటులు, దర్శకుల చేత భారీ బడ్జెట్‌తో వెబ్ సిరీస్‌లు, వెబ్ సినిమాలు తీస్తున్నారు. అయితే, హిందీకి వున్నంత వైడ్ రీచ్ రీజనల్ లాంగ్వేజ్ సిరీస్‌లకు ఉండదనే విషయం తెలిసిందే. మరీ దీన్ని అల్లు అరవింద్ ఎలా మ్యానేజ్ చేస్తాడో చూడాలి.