
అల వైకుంఠపురములో.. అటు ఓవర్సీస్ లోనూ ఇటు ఇండియా లోనూ భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. ఈ రోజు చిత్ర నిర్మాతలు గీతా ఆర్ట్స్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా .. 10 రోజుల సినిమా వసూళ్లను గ్రాస్ మరియు షేర్ వివరాలతో కూడిన పోస్టర్ ని రిలీజ్ చేసారు. వసూళ్లు మాములుగా లేవు… ద్యావుడా.. అన్నట్టు ఉన్నాయి. ఇదే రీతిగా రెండు రోజులు కొనసాగితే అత్యధిక వసూళ్లు సాధించిన రెండొవ తెలుగు చిత్రంగా రికార్డ్స్ లో నిలిచిపోతుంది. అంటే తెలుగు కలెక్షన్స్ లో బాహుబలి సినీమా తర్వాత అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డు క్రియేట్ చేస్తుంది. ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు రాబట్టిన తెలుగు సినిమాల లిస్ట్ ఇలా ఉంది.
- బాహుబలి 2 (తెలుగు వెర్షన్స్) 310కోట్లు (షేర్స్) : డైరెక్టర్ – రాజమౌళి…
- బాహుబలి 1 (తెలుగు) -183 కోట్లు (షేర్స్) – : డైరెక్టర్ – రాజమౌళి…
- సైరా నరసింహా రెడ్డి – 134కోట్లు – డైరెక్టర్ – సురేందర్ రెడ్డి…
- అల వైకుంఠపురములో – 130కోట్లు(+) నాటౌట్ – డైరెక్టర్ త్రివిక్రమ్…
- సరిలేరు నీకెవ్వరు – 124కోట్లు (+)నాటౌట్ – డైరెక్టర్ అనిల్ రావిపూడి…
- రంగస్థలం – 119కోట్లు – డైరెక్టర్ సుకుమార్…
- ఖైదీ నెంబర్ 150 – 102కోట్లు – డైరక్టర్ వివి.వినాయక్…
- మహర్షి – 101కోట్లు – డైరెక్టర్ వంశీ పైడిపల్లి…
- భరత్ అనే నేను – 94కోట్లు : డైరెక్టర్ – కొరటాల శివ…
- అరవింద సమేత – 88కోట్లు – డైరెక్టర్ త్రివిక్రమ్…
- శ్రీమంతుడు – 84కోట్లు – డైరెక్టర్ కొరటాల శివ…

Read More: వైరల్ అవుతున్న ఫోటో : వైస్సార్ విగ్రహాన్ని తగలబెట్టిన వైనం