
దర్శకుడి మనసులో ఒక విజన్ ఉంటుంది.. దాన్ని మనోనేత్రంతో గమనించి, ఆ సన్నివేశానికి ప్రాణం పోస్తాడు కెమెరామెన్! వీరిద్దరికీ ఎంత బాగా లంకె కుదిరితే.. తెరపై అంత అద్భుతంగా దృశ్యం ఆవిష్కృతమవుతుంది. అలాంటి నిబద్ధత ఉన్నవారు ఏ ఇండస్ట్రీలోనైనా చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ఫొటో గ్రఫీ అయినా.. సినిమాటోగ్రఫీ అయినా.. అదో ఉద్యోగం కానేకాదు. అదొక కళ. ఆ కళను అణువుణువునా నింపుకున్నవారు మాత్రమే తెరపై అద్భుతాలను సృష్టించగలరు. అలాంటి కెమెరామెన్లలో ఒకరు లోక్ సింగ్.
Also Read: క్రికెటర్ పెళ్లి.. అందరి చూపు ఆ హీరోయిన్ పైనే !
చెన్నైకి చెందిన ఈ నాటితరం కెమెరామెన్.. ప్రఖ్యాత దర్శకుడు ఎ.భీమ్ సింగ్ అన్న కొడుకు. ప్రస్తుత ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్ననాటి స్నేహితుడే ఈ లోక్ సింగ్. ఆ విధంగా చిన్నతనంలోనే సినిమా వాతావరణంలో పెరగడంతో.. తాను కెమెరామెన్ కావాలని నిర్ణయించుకున్నారు. కె.ఎస్. ప్రసాద్ దగ్గర పనిలో చేరిన ఆయన.. ఆ తర్వాత ఇషాన్ ఆర్య, బాబా అజ్మీ దగ్గర కూడా పనిచేశారు. అలా.. బాబా అజ్మీ సారథ్యంలో వచ్చిన రాజాధిరాజు సినిమాకు ఆపరేటివ్ కెమెరామెన్ గా పనిచేశారు. ఆ తర్వాత అల్లు అరవింద్ తో ఉన్న సాన్నిహిత్యం వల్ల కె.విశ్వనాథ్ డైరెక్షన్లో వచ్చిన శుభలేఖ చిత్రానికి పూర్తిస్థాయి కెమెరామెన్ అయ్యారు.
ఈ సినిమాలో చిరంజీవిని అప్పటి వరకూ ఎవరూ చూపించలేనంత అందగా చూపించాడు లోక్ సింగ్. ఆ తర్వాత యమకింకరుడు సినిమాలో చిరును సరికొత్తగా ఆవిష్కరించాడు. ఈ సినిమాతోనే చిరంజీవి యాక్షన్ హీరోగా మారిపోయారు. ఆ తర్వాత మంత్రిగారి వియ్యంకుడు సినిమాలోనూ సత్తా చాటాడు. అనంతరం వచ్చిన అభిలాష సినిమాతో తన సత్తా ఏంటో చాటిచెప్పారు లోక్ సింగ్. ఆ సినిమాలో పాటలు, డ్యాన్సులు అన్నీ తెరపై అద్దిరిపోయాయి. ఆయన ఏ సినిమా చేసినా.. అందులో డెడికేషన్ ఎలా ఉండేదంటే.. సీన్ తాను అనుకున్నట్టుగా రాకపోతే అస్సలు ఊరుకునేవారు కాదు.
Also Read: ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక్కటే టాపిక్ !
చిరంజీవి-విజయబాపినీడు కాంబినేషన్లో ‘హీరో’ సినిమా వచ్చింది. ఇందులో ఒక సీన్లో చిరంజీవి మీదకు విలన్ లారీతో దూసుకొస్తాడు. అయితే.. ఆ సీన్లో లారీ డ్రైవర్ తాను అనుకున్న విధంగా డ్రైవింగ్ చేయట్లేదు. ఎన్ని సార్లు చెప్పినా.. పర్ఫెక్షన్ రావట్లేదు. దీంతో.. చిరాకు పడిన లోక్ సింగ్.. అసిస్టెంట్ కు కెమెరా అప్పగించి, తానే లారీని నడిపారు. అదీ.. పనిమీద ఆయనకున్న ప్యాషన్. అయితే.. ఈ ప్యాషనే ఆయన ప్రాణాలు బలిగొనడం విషాదకరం.
నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తన కొడుకు భరత్ ను హీరోగా పెట్టి ‘వార్నింగ్’ అనే సినిమా తీశాడు. ఈ సినిమాలో హీరోయిన్ ఆమని మంటల మధ్య డ్యాన్స్ చేయాలి. ఆ మంటలు కొనసాగించేందుకు ఓ వ్యక్తి పెట్రోలు పోస్తున్నాడు. అయితే.. ఎంతకీ ఆ మాటలు తాను అనుకున్నట్టుగా రావట్లేదని, తానే వెళ్లి పెట్రోల్ పోశారు లోక్ సింగ్. అయితే.. అప్పుడు ఆయన ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకొని ఉన్నారు. పెట్రోల్ పోస్తుండగా.. ఆ షర్ట్ కూడా తడిసిపోసాగింది. కేవలం సీన్ పర్ఫెక్ట్ గా రావడం మీదనే దృష్టి పెట్టిన లోక్ సింగ్.. తన షర్ట్ పెట్రోల్ లో తడిసిపోతోందన్న విషయాన్నే గమనించలేదు. దీంతో.. ఒక్కాసారిగా ఎగసిన మంటలు.. ఆయన్ను చుట్టుముట్టేశాయి. ఆ విధంగా.. అందరూ చూస్తుండగానే ఆయన మంటల్లో కాలిపోయారు! వృత్తిపై ఎంతో నిబ్ధత ఉన్న లోక్ సింగ్.. అలా మంటల్లో కాలిపోవడం అత్యంత విషాదకరం.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్