Samantha, Naga Chaitanya : అక్కినేని వారసుడు నాగచైతన్య.. హీరోయిన్ సమంత ప్రేమ విషయం బయటకు వచ్చినప్పుడు అందరూ అవాక్కయ్యారు. వీరి పెళ్లి గురించి తెలుసుకొని హ్యాపీగా ఫీలయ్యారు. కానీ.. ఇప్పుడు విడాకుల వార్తలతో అక్కినేని అభిమానులతోపాటు అందరినీ షాక్ కు గురిచేశారు. కొన్నాళ్లుగా ఏదో జరుగుతోందన్నట్టుగా ప్రచారం సాగినప్పటికీ.. ఇప్పుడు ఏకంగా విడాకులకు సిద్ధమయ్యారనే వార్త సంచలనం రేకెత్తిస్తోంది. దీంతో.. నాగార్జున రంగంలోకి దిగినట్టు సమాచారం.
ఎప్పుడైతే సమంత తన పేరు నుంచి అక్కినేని ఇంటిపేరును తొలగించిందో.. అప్పుడే బలమైన అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం ప్రస్తావించగా.. తనకు నచ్చినప్పుడే స్పందిస్తానని దాటవేయడంతో ఏదో జరుగుతోందన్న విషయం స్పష్టమైపోయింది. మొన్నటికి మొన్న బ్రేకప్ స్టోరీని సోషల్ మీడియాలో పోస్టు చేసిన సమంత.. తాజాగా నాగ చైతన్య – సాయిపల్లవి నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమా రిలీజ్ నేపథ్యంలో శుభాకాంక్షలు చెబుతూ పోస్టు చేసింది. అయితే.. ఇందులో కేవలం సాయిపల్లవి పేరు మాత్రమే రాసి, గ్రీటింగ్స్ చెప్పడం విశేషం.
దీంతో.. వీళ్లిద్దరి మధ్య దూరం చాలా దూరం వెళ్లిపోయిందని తేలిపోయింది. చివరకు చైతూ పేరును కూడా రాయడానికి సమంత ఇష్టంగా లేనట్టుందని అంటున్నారు. అంతేకాదు.. ప్రస్తుతం సమంత హైదరాబాద్ లో ఉండట్లేదు. చైతూకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో చెన్నైలో నివాసం ఉంటోంది. త్వరలో ముంబైకి షిఫ్ట్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అక్కడే ఉంటూ.. వెబ్ సిరీస్ లు, సినిమాలు చేసుకోవాలని సమంత ఫిక్స్ అయినట్టు సమాచారం.
ఇదిలాఉంటే.. వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి మానసికంగా సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. అంతేకాదు.. ఈ మేరకు దరఖాస్తు కూడా చేసినట్టు చెబుతున్నారు. అయితే.. తొలి విడతగా కౌన్సెలింగ్ ఇచ్చినప్పటికీ.. వీరు తమ నిర్ణయం మార్చుకోవడానికి సిద్ధంగా లేరని సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో నాగార్జున రంగంలోకి దిగి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ.. వారిద్దరూ విడిపోవడానికే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది.
కేవలం ఇగో వల్లే పరిస్థితి ఇంతదాకా వచ్చిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నాగచైతన్య రిజర్వుడుగా ఉంటారు. సమంత ఫుల్ ఓపెన్ గా ఉంటారు. ఈ క్రమంలో వీరిద్దరికీ పొసగకపోవడం వల్లే.. చివరకు విడాకుల వరకూ ఇష్యూ వెళ్లిందని అంటున్నారు. మరి, ఏం జరుగుతుంది? వీరి సమస్యకు విడిపోవడమే ఏకైక మార్గమా? కలిసే అవకాశం ఉందా? అన్నది చూడాలి.