https://oktelugu.com/

సంజయ్ దత్ డైలాగ్స్ ప్రత్యేకమట !

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో రానున్న `కేజీఎఫ్ చాప్టర్- 2’లో ప్రధానమైన ప్రతినాయకుడి పాత్ర అధీరా కోసం బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ను ఎంచుకున్నారనగానే ఈ భారీ యాక్షన్ సినిమా పై హైప్ మరింత పెరిగింది. దీనికితోడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను పార్ట్ 1 కంటే భీభత్సమైన రీతిలో తెరకెక్కిస్తున్నాడనే టాక్ రావడంతో ఈ సినిమా పై అన్ని ఇండస్ట్రీల నుండి భారీ అంచనాలు ఉన్నాయి. […]

Written By:
  • admin
  • , Updated On : October 12, 2020 / 05:52 PM IST
    Follow us on


    కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో రానున్న `కేజీఎఫ్ చాప్టర్- 2’లో ప్రధానమైన ప్రతినాయకుడి పాత్ర అధీరా కోసం బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ను ఎంచుకున్నారనగానే ఈ భారీ యాక్షన్ సినిమా పై హైప్ మరింత పెరిగింది. దీనికితోడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను పార్ట్ 1 కంటే భీభత్సమైన రీతిలో తెరకెక్కిస్తున్నాడనే టాక్ రావడంతో ఈ సినిమా పై అన్ని ఇండస్ట్రీల నుండి భారీ అంచనాలు ఉన్నాయి. ఇక సంజయ్ దత్ కి సంబంధించిన పార్ట్ ను ఇప్పటికే షూట్ చేయడంతో పాటు ఎడిటింగ్ కూడా పూర్తయింది. ఇక తాజాగా డబ్బింగ్ ఆర్టిస్ట్ రవిశంకర్ అధిరా పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పాడట.

    Also Read: పవన్ సినిమా కోసం భారీ సెట్ !

    కాగా డైలాగ్స్ అన్ని అద్భుతంగా వచ్చాయని.. సినిమా మొత్తంలోనే అధీరా డైలాగ్స్ మెయిన్ హైలైట్ గా ఉంటాయని.. అలాగే చాల ప్రత్యేకంగా ఉంటాయని రవిశంకర్ చెప్పుకొచ్చాడు. ‘యశ్’ కంటే కూడా సంజయ్ దత్ నే హైలెట్ అవుతాడట. ఇక హోంబలే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో ఆ స్థాయిలొనే ఖర్చు పెడుతున్నారట. పైగా యావత్తు భారతదేశం ఎదురు చూస్తున్న కొన్ని మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఈ సినిమా కూడా ఒకటి కావడం, మొదటి పార్ట్ బంపర్ హిట్ కావడం, ఈ చిత్రం కోసం అన్ని భాషల ఇండస్ట్రీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూడటం ముఖ్యంగా మాస్ ఆడియెన్స్ ఈ సినిమా పై పెట్టుకున్న అంచనాలు ఓ రేంజ్ లో ఉండటంతో… `కేజీఎఫ్ చాప్టర్- 2′ కొత్త రికార్డ్స్ ను సృష్టించడం ఖాయం అంటున్నారు.

    Also Read: పూరి-నాగార్జున హాట్రిక్ కొడుతారా?

    ఇక కేజీఎఫ్ అనగా కోలార్ బంగారు గ‌నులు. ద‌శాబ్ధాల క్రితం కోలార్ బంగారు గ‌నుల్లో మాఫియా క‌థతో ఈ సినిమా రెండు పార్ట్ లు గా రాబోతుంది. కాగా కేజీఎఫ్ గ‌నుల‌ పై ప్ర‌పంచ మాఫియా క‌న్ను ఎలా ఉండేది అన్న‌ దానిని తొలి భాగంలోనే ప్రశాంత్ అద్భుతంగా రివీల్ చేశాడు, పార్ట్ 2లో కూడా ఇంకా భీక‌ర మాఫియాని ప‌తాక స్థాయిలో చూపించ‌నున్నాడు.