బాధలో ప్రముఖ నిర్మాత.. ముప్పై కోట్లు నష్టం !

కరోనా మహమ్మారి సినీ పరిశ్రమను గత నెలలుగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. అయితే నిన్న వచ్చిన తుఫాన్‌ కూడా సినీ పరిశ్రమకు కల్లోలాన్ని మిగిల్చింది. ముంబైలోని పలు ప్రాంతాలు తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయాయి. అయితే ఈ తుఫాన్‌ వ్యాపారస్తులకు, సామాన్య జనానికే బాలీవుడ్ పరిశ్రమను కూడా కష్టాల పాలు చేసింది. ఈ తుఫాన్ దెబ్బకు బాలీవుడ్‌ కు చెందిన భారీ సినిమాల పెద్ద సెట్టింగ్స్ ఒక్కసారిగా కూలిపోయాయి. కొన్ని సెట్స్ తీవ్రంగా దెబ్బ తిన్నాయి. […]

Written By: admin, Updated On : May 23, 2021 4:13 pm
Follow us on

కరోనా మహమ్మారి సినీ పరిశ్రమను గత నెలలుగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. అయితే నిన్న వచ్చిన తుఫాన్‌ కూడా సినీ పరిశ్రమకు కల్లోలాన్ని మిగిల్చింది. ముంబైలోని పలు ప్రాంతాలు తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయాయి. అయితే ఈ తుఫాన్‌ వ్యాపారస్తులకు, సామాన్య జనానికే బాలీవుడ్ పరిశ్రమను కూడా కష్టాల పాలు చేసింది.

ఈ తుఫాన్ దెబ్బకు బాలీవుడ్‌ కు చెందిన భారీ సినిమాల పెద్ద సెట్టింగ్స్ ఒక్కసారిగా కూలిపోయాయి. కొన్ని సెట్స్ తీవ్రంగా దెబ్బ తిన్నాయి. దాంతో హిందీ ఇండస్ట్రీకి వందల కోట్ల నష్టం వచ్చి పడింది. ముఖ్యంగా ‘మైదాన్’ అనే సినిమా కోసం ఎంతో కష్టపడి భారీ సెట్ ను నిర్మించారు. అంటే సినిమాలో చాల భాగం ఈ సెట్ లోనే తీసే విధంగా సెట్ ను నిర్మించారు. అంతలో కరోనా సెకెండ్ వేవ్ రావడం,

షూటింగ్స్ కి బ్రేక్ పడటంతో నిర్మాత బోనీకపూర్ ఈ సెట్ ను జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక తుఫాన్ దాటికి ఈ సెట్ కొట్టుకుపోయింది. సుమారు రూ.30 కోట్ల న‌ష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది . ఈ సెట్ వేయడానికి ముప్పై ఐదు కోట్లు ఖర్చు అయిందట. సెట్ తాలూకు ప్రాపర్టీస్ కొన్ని ఇంకా మిగిలి ఉన్నాయి కాబట్టి, ఐదు కోట్లు తప్ప మిగిలిన ముప్పై కోట్లు వృధా అయిపోయినట్టే.

బోనికపూర్ మాట్లాడుతూ..‘ భారీ సెట్ నిర్మించాం. అయితే ప్రస్తుత తౌటే తుఫాన్ ధాటికి సెట్ అంతా కూలిపోయి రాకుండా పోయింది. దాదాపు రూ.30 కోట్ల నష్టం వాటిల్లిందని లెక్కలు చెబుతున్నాయి’ అంటూ బోనికపూర్ తన బాధను చెప్పుకున్నాడు. అజయ్ దేవగణ్ హీరోగా బోనికపూర్ నిర్మిస్తున్న ఈ మైదాన్ చిత్రం పై మంచి అంచనాలు ఉన్నాయి.