https://oktelugu.com/

సుకన్య సమృద్ధి స్కీమ్ తో 15 లక్షలు మీ సొంతం.. ఎలా అంటే..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ అమలు చేస్తున్న స్కీమ్ లలో సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ ఒకటనే సంగతి తెలిసిందే. ఆడపిల్లలకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. ఒకే ఇంట్లో గరిష్టంగా ఇద్దరు అమ్మాయిలు ఈ స్కీమ్ లో చేరే అవకాశం ఉండగా పదేళ్ల లోపు అమ్మాయిలు మాత్రమే ఈ స్కీమ్ లో చేరే అవకాశం ఉంటుంది. కూతురుకు బంగారం లాంటి భవిష్యత్ ను కానుకగా ఇవ్వాలని […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : May 23, 2021 / 04:07 PM IST
    Follow us on

    కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ అమలు చేస్తున్న స్కీమ్ లలో సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ ఒకటనే సంగతి తెలిసిందే. ఆడపిల్లలకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. ఒకే ఇంట్లో గరిష్టంగా ఇద్దరు అమ్మాయిలు ఈ స్కీమ్ లో చేరే అవకాశం ఉండగా పదేళ్ల లోపు అమ్మాయిలు మాత్రమే ఈ స్కీమ్ లో చేరే అవకాశం ఉంటుంది.

    కూతురుకు బంగారం లాంటి భవిష్యత్ ను కానుకగా ఇవ్వాలని అనుకునే తల్లిదండ్రులు ఈ స్కీమ్ లో చేరితే మంచిది. 250 రూపాలతో సులభంగా సమీపంలోని పోస్టాఫీస్ బ్రాంచ్ కు వెళ్లి సుకన్య సమృద్ధి ఖాతాను తెరవచ్చు. ఆ తరువాత సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో ప్రతి నెలా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా లక్షన్నర రూపాయల వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ స్కీమ్ లో చేరే అవకాశం ఉంటుంది.

    ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ పై కేంద్రం ఏకంగా 7.6 శాతం వడ్డీరేటును అందిస్తోంది. ప్రతి నెలా 3,000 రూపాయల చొప్పున ఈ స్కీమ్ లో డిపాజిట్ చేయడం వల్ల మెచ్యూరిటీ సమయంలో ఏకంగా 15 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా లక్షన్నర రూపాయల వరకు ఈ స్కీమ్ లో డిపాజిట్ చేయవచ్చు.

    సమీపంలోని పోస్టాఫీస్ బ్రాంచ్ ను సంప్రదించి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. స్కీమ్ లో చేరిన ఏడాది నుంచి 15 ఏళ్ల వరకు డబ్బులు డిపాజిట్ చేసుకుంటూ వెళ్లాలి.