బాలయ్య పుట్టిన రోజు వేడుకలకు మెగాస్టార్ వెళతారా?

జూన్ 10 నటసింహాం నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు. బుధవారంతో ఆయన 60వ పడిలోకి వెళుతున్నారు. దీంతో బాలయ్య షష్ఠి పూర్తి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో కొంతమంది ప్రముఖులకు మాత్రమే బాలయ్య షష్ఠి పూర్తి వేడుకలకు హాజరయ్యే అవకాశం ఉంది. అయితే ఇటీవల సీఎం కేసీఆర్ మీటింగ్ కు తనకు టాలీవుడ్ పెద్దలు ఆహ్వానం పంపలేదని బాలయ్య ఫైర్ అయ్యారు. ఇండస్ట్రీ పెద్దలంతా భూములు పంచుకుంటున్నారా? అంటూ నోరుజారారు. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో […]

Written By: Neelambaram, Updated On : June 9, 2020 8:10 pm
Follow us on


జూన్ 10 నటసింహాం నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు. బుధవారంతో ఆయన 60వ పడిలోకి వెళుతున్నారు. దీంతో బాలయ్య షష్ఠి పూర్తి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో కొంతమంది ప్రముఖులకు మాత్రమే బాలయ్య షష్ఠి పూర్తి వేడుకలకు హాజరయ్యే అవకాశం ఉంది. అయితే ఇటీవల సీఎం కేసీఆర్ మీటింగ్ కు తనకు టాలీవుడ్ పెద్దలు ఆహ్వానం పంపలేదని బాలయ్య ఫైర్ అయ్యారు. ఇండస్ట్రీ పెద్దలంతా భూములు పంచుకుంటున్నారా? అంటూ నోరుజారారు. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో రచ్చ మొదలైంది.

ఆ తర్వాత బాలయ్య వ్యాఖ్యలకు కౌంటర్ గా మెగాబ్రదర్ నాగబాబు మాట్లాడటంతో ఇష్యూ కాస్తా మరింత పెరిగింది. బాలయ్య ఫ్యాన్స్ నాగబాబును టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేయడంతో మెగా ఫ్యాన్స్ ఎంటరయ్యారు. గతంలో లేపాక్షి ఉత్సవాలకు చిరంజీవిని బాలయ్య ఆహ్వానించారా? అప్పుడు బాలయ్య మాట్లాడిన వీడియోను మెగా ఫ్యాన్స్ బయటికి తీశారు. దీంతో ఈ ఇష్యూ కాస్తా చిరంజీవి వర్సస్ బాలయ్య వివాదంగా మారింది. అయితే బాలయ్య వ్యాఖ్యలపై చిరంజీవి స్పందించలేదు. బాలయ్య మాత్రం ఇటీవల తరుచూ మీడియాలో ఇంటర్య్వూలు ఇస్తూ మెగాస్టార్ ను టార్గెట్ చేస్తూనే వస్తున్నారు.

అమెరికాలో సినిమా ఆర్టిస్టులతో జరిగిన ప్రొగ్రాంకు తనను చిరంజీవి పిలవలేదని చెప్పాడు. అప్పుడు 5కోట్లు వచ్చాయని చెప్పారని అందులో ఒక కోటితో ‘మా’ అసోసియేషన్ బిల్డింగ్ నిర్మించారని.. మిగతా 4కోట్లు ఏమైయ్యాయని ప్రశ్నించారు. ఇలాంటి విషయాల్లో తాను కలుగజేసుకోనంటూనే మేమేమన్న లెక్కల మాస్టార్లమా? లెక్కలు చూసుకోవడానికి అంటూ కామెంట్ చేశారు. అదేవిధంగా నాగబాబు వ్యాఖ్యలపై చీ.. ఛీ నేను అతడిపై మాట్లాడమేంటీ.. అతనే నాపై లేనిపోనివి మాట్లాడుతున్నదంటూ కామెంట్ చేసి మరింత అగ్గి రాజేశాడు.

ఈ నేపథ్యంలో చిరంజీవి బృందం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు అపార్ట్మెంట్ తీసుకున్నారు. దీనికి బాలయ్యకు ఆహ్వానం పంపించారు. అయితే తన షష్ఠి పూర్తి వేడుకలు ఉన్నందున రాలేనంటూ బాలయ్య స్పష్టం చేశాడు. దీంతో చిరంజీవి నేతృత్వంలో పలువురు సినీ ప్రముఖులు నేడు జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అయితే నేడు జగన్మోహన్ రెడ్డిని కలిసేటప్పుడు చిరంజీవి-బాలయ్య ఉంటారని ఇండస్ట్రీలోని పెద్దలు భావించారు. అయితే అందుకు భిన్నంగా బాలయ్య హాజరుకాకపోవడంతో బాలయ్య-చిరంజీవి మధ్య అధిపత్య పోరు నడుస్తుందా? అనే భావన ఇండస్ట్రీలో రచ్చ నడుస్తుంది.

ఇదిలా ఉంటే రేపు బాలయ్య పుట్టిన రోజు వేడుక ఉండటంతో బాలయ్య మెగాస్టార్ ను ఆహ్వానిస్తారా?.. పిలిస్తే మెగాస్టార్ వెళతారా? అనే చర్చ అభిమానుల్లో నడుస్తుంది. అలాగే చిరంజీవి సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చాక తోటి నటీనటులు, ప్రముఖుల జన్మదినం సందర్భంగా ట్వీటర్లో విషెస్ చెబుతుంటారు. రేపు బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ ట్వీటర్లో ఆయనకు విషెస్ చెబుతారా? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. చిరంజీవి పెట్టే పోస్టులు కూడా చాలా చిలిపిగా ఉండటంతోపాటు వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసేలా ఉంటాయి. దీంతో మెగాస్టార్ బాలయ్య గురించి ఎలాంటి ట్వీట్ పెడుతారానే ఆసక్తి నెలకొంది.

బాలయ్య పుట్టిన రోజునాడైనా ఇద్దరు టాప్ హీరోలు ఒక్కటైతే అంతకంటే అభిమానులకు కావాల్సింది ఏముంది?.. వీరిద్దరు ఒక్కచోట చేరితే ఇప్పటివరకు ఇండస్ట్రీలో చోటుచేసుకుంటున్న వివాదాలకు ఫుల్ స్టాప్ పడినట్లు అవుతుందని టాలీవుడ్ పెద్దలు భావిస్తున్నారు. మరీ ఇది జరుగుతుందా? లేదా అనేది రేపటి రోజులు తేలనుంది. అంతవరకు మనం వేచి చూడాల్సిందే..!