ప్రస్తుతం సినిమాల్లో బయోపిక్ ల హవా నడుస్తుంది. క్రీడాకారులు, సీని ప్రముఖుల జీవితాల ఆధారంగా తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెల్సిందే. క్రికెట్ నేపథ్యంగా వచ్చిన ‘లగాన్’ మూవీ బాలీవుడ్లో సరికొత్త రికార్డులు సృష్టించిన సంగతి తెల్సిందే. అదేవిధంగా స్పోర్స్ నేపథ్యంతో వచ్చిన ‘చక్ దే ఇండియా’, ‘దబాంగ్’ తదితర మూవీలన్ని ఘన విజయం సాధించాయి. తాజాగా మాజీ ఇండియన్ కెప్టెన్ కపిల్ దేవ్ జీవితాధారంగా ‘83’ సినిమా తెరకెక్కుతుంది.
‘83’మూవీకి కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో కపిల్ పాత్రను రణ్‌వీర్ సింగ్, అలాగే అతడి భార్య రోమి పాత్రలో దీపికా పదుకొణె నటిస్తుంది. తాజాగా ఈ చిత్రబృందం 1983లో కపిల్‌దేవ్ ప్రపంచకప్‌ను అందుకుంటున్న సన్నివేశాన్ని చిత్రీకరించింది. రణ్‌వీర్, కబీర్, టెన్నిస్ ఆటగాడు మహేశ్ భూపతి ఈ రోజు ఆ ఫోటోను విడుదల చేశారు. అంతేకాకుండా ‘83’ సినిమాలో ఉపయోగించిన దుస్తులు, వస్తువులను అమ్మకానికి పెట్టారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
1983లో భారత్ ప్రపంచ కప్ అందుకుంది. వెస్టిండీస్ జట్టుపై భారత్ గెలిచి తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. నాడు కపిల్‌దేవ్ తొలిసారి ప్రపంచకప్ అందుకొని ముద్దాడాడు. నాడు భారత జట్టు విరోచిత పోరాటాన్ని దర్శకుడు కబీర్ ఖాన్ అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. భారత క్రికెట్ అభిమానులతోపాటు సినీ అభిమానులకు ముందుకు నాటి ప్రపంచకప్ సన్నివేశాలను ‘83’ మూవీ తీసుకురానుంది. మరోసారి భారత్ ప్రపంచకప్ గెలుచుకునే దృశ్యాన్ని థియేటర్లలో చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కనుంది. త్వరలోనే ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.