https://oktelugu.com/

‘కీర్తి సురేష్’ గ్యాప్ కూడా ఇచ్చేలా లేదు !

‘కీర్తి సురేష్’ వ్యవహారం నెటిజన్లకు చాల కొత్తగా ఉంది. మాట్లాడితే యోగాసనాలు వేస్తూ స్టిల్స్ తీయించుకుని సోషల్ మీడియాలో వదులుతుంది. ఒకప్పుడు ముద్దుగా, కాస్తా బొద్దుగా ఉండే కీర్తి తాజాగా బక్కచిక్కి మొత్తానికి బాగా సన్నబడి కనిపిస్తుంది. దీనికితోడు ‘యోగ బాగా చెయ్యి, ఒంటికి మంచిది’ అన్నట్లు సాగుతుంది కీర్తి సురేష్ మూడ్. ఈ లాక్ డౌన్ సమయాన్ని కీర్తి ఎక్కువగా యోగాసనాలకే కేటాయించింది. యోగాతోనే పూర్తిగా టైం పాస్ చేస్తుంది. పైగా యోగా గురించి తన […]

Written By:
  • admin
  • , Updated On : June 3, 2021 / 05:26 PM IST
    Follow us on

    ‘కీర్తి సురేష్’ వ్యవహారం నెటిజన్లకు చాల కొత్తగా ఉంది. మాట్లాడితే యోగాసనాలు వేస్తూ స్టిల్స్ తీయించుకుని సోషల్ మీడియాలో వదులుతుంది. ఒకప్పుడు ముద్దుగా, కాస్తా బొద్దుగా ఉండే కీర్తి తాజాగా బక్కచిక్కి మొత్తానికి బాగా సన్నబడి కనిపిస్తుంది. దీనికితోడు ‘యోగ బాగా చెయ్యి, ఒంటికి మంచిది’ అన్నట్లు సాగుతుంది కీర్తి సురేష్ మూడ్.

    ఈ లాక్ డౌన్ సమయాన్ని కీర్తి ఎక్కువగా యోగాసనాలకే కేటాయించింది. యోగాతోనే పూర్తిగా టైం పాస్ చేస్తుంది. పైగా యోగా గురించి తన ఫాలోవర్స్ కి అవగాహన కూడా కల్పిస్తూ ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో అవకాశం దొరికితే చాలు యోగ వీడియోలు తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. తనను తానూ కొత్తగా సరికొత్తగా మార్చుకుంటున్నాను అంటూ ఇన్ డైరెక్ట్ గా పబ్లిసిటీ కూడా చేసుకుంటుంది.

    అయితే కీర్తి సురేష్ విపరీతంగా సన్నబడటంతో ఆమె శరీరాకృతి పై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. వాటిల్లో పాజిటివ్ కంటే నెగిటివ్ కామెంట్స్ ఎక్కువుగా ఉన్నాయి . అందుకే, కీర్తి మళ్ళీ కాస్త లావు అయిందట. గతంలో బలమైన శరీర సౌష్టవంతో కనిపించే ఈ హోమ్లీ బ్యూటీ, త్వరలోనే అలాంటి లుక్ కోసమే ప్రస్తుతం కసరత్తులు చేస్తోంది.

    ఇంతగా కసరత్తులు పేరుతో కష్టపడటానికి కారణం ‘అయ్యో కీర్తి.. మీకు ఏమైంది. ఎందుకు మరీ ఇంతగా సన్నబడ్డారు, మీరు బొద్దుగా ఉంటేనే బాగుంటారు, ఇలా అసహ్యంగా ఉన్నారు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ రూపంలో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ తెగ పోస్ట్ లు పెట్టారు. ఆ పోస్ట్ లు దెబ్బకు కీర్తిలో చాల మార్పు వచ్చినట్టు ఉంది. మళ్ళీ లావు పెరిగే పనిలో ఉంది. కీర్తి ప్రస్తుతం మహేష్ సరసన సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.