2015 లో ` శ్రీమంతుడు ` చిత్రం తో ఘనంగా ప్రారంభమైన మైత్రి మూవీ మేకర్స్ ప్రస్తుతం తెలుగు లో ఉన్న అతి పెద్ద నిర్మాణ సంస్థలలో ఒకటి. ఆ క్రమంలో తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకి, అగ్ర దర్శకులకి ఈ సంస్థ భారీ అడ్వాన్సులు ఇచ్చి కూర్చుంది. అలాగే వీరి సినిమాలు పలు దశలలో నిర్మాణంలో ఉన్నాయి. వీరి నిర్మాణం లో తయారైన, మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ నటించిన ` ఉప్పెన ` చిత్రం రిలీజ్ కి రెడీగా ఉంది . మైత్రి మూవీస్ ఈ చిత్రంపై 22 కోట్లకి పైగా పెట్టుబడి పెట్టడంతో పాటు సినిమా మీద నమ్మకం తో స్వయంగా విడుదల చేసుకుందాం అనుకొంది. కానీ సడన్ గా కరోనా లాక్ డౌన్ రావడం వల్ల వడ్డీ భారం పెరుగుతోంది.
అదలా ఉంటే బన్నీ నటిస్తున్న “పుష్ప” సినిమాపై ఇప్పటికే చాలా ఖర్చు పెట్టేసారు. అలాగే ప్రభాస్ కి, మహేష్ బాబు కి చెరో ఇరవై కోట్ల వరకు అడ్వాన్స్ ఇచ్చారని తెలుస్తోంది. అలా మైత్రి మూవీ మేకర్స్ వారి డబ్బు మొత్తం లాక్ అయిపోయి వున్న సమయం లో ఈ ప్రాజెక్టులు ముందుకి కదలకపోతే వడ్డీ భారం మరింతగా పెరుగుతూ పోతుంది. ఇవన్నీ ఒకెత్తు అయితే పవన్ కళ్యాణ్ , హరీష్ శంకర్ కాంబో లో మూవీ ఒకటి ఖాయం చేసుకుని ఉన్నారు. ఆ లెక్కన మైత్రి మూవీస్ వారికి కనీసం వంద కోట్ల వరకు రికవరీ అవ్వాలి. దరిమిలా మైత్రి మూవీస్ వారు ఆర్ధిక ఇబ్బందుల్లో ఈదుతున్నారు .