Lok Sabha Election 2024
Lok Sabha Election 2024: భారతదేశం ఒక బహుళ–పార్టీ వ్యవస్థ గల దేశం. మన దేశంలో జాతీయ, ప్రాంతీయ పార్టీలు అనేకం. ఇందులో గుర్తింపు పొందినవి, గుర్తింపు లేనివి కూడా ఉన్నాయి. ప్రధాన ఎన్నికల కమిషన్ పార్టీలకు గుర్తింపునిస్తుంది. గుర్తింపులతోపాటు పార్టీ గుర్తులను కేటాయిస్తుంది. భారత రాజ్యాంగం ప్రకారం, మన దేశ రాజకీయ వ్యవస్థ ఫెడరల్ వ్యవస్థ. భారత రాజకీయ పార్టీలు, జాతీయ మరియు రాష్ట్రస్థాయి లేదా ప్రాంతీయ పార్టీలుగా వర్గీకరించడమైనది. ప్రస్తుతం దేశంలో 6 జాతీయ పార్టీలు, 56 కన్నా ఎక్కువ గుర్తింపు పొందిన పార్టీలు ఉన్నాయి. గుర్తింపు లేని పార్టీలు 2,796 వరకు ఉన్నాయి.
ఈసీఐ ద్వారా గుర్తింపు..
ఒక రాజకీయ పార్టీ నిర్దిష్ట లక్ష్యాలను నెరవేరిస్తే అది భారత ఎన్నికల సంఘం (ECI)జాతీయ లేదా రాష్ట్ర రాజకీయ పార్టీగా గుర్తింపు ఇస్తుంది. ఈసీఐ ద్వారా గుర్తింపు పొందిన పార్టీ రిజర్వ్ చేయబడిన పార్టీ గుర్తు, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే టెలివిజన్, రేడియోలో ఉచిత ప్రసార సమయం, ఎన్నికల తేదీల సెట్టింగ్‌లో సంప్రదింపులు మరియు మరిన్ని వంటి నిర్దిష్ట అధికారాలను పొందుతుంది.
జాతీయ రాజకీయ పార్టీలు..
– కనీసం 3 వేర్వేరు రాష్ట్రాల నుండి లోక్‌సభలో 11 సీట్లు లేదా 2% స్థానాలను పార్టీ గెలుచుకోవాలి.
– లోక్‌సభ లేదా శాసనసభకు జరిగే సాధారణ ఎన్నికలలో, పార్టీ 4 లోక్‌సభ స్థానాలతో పాటు నాలుగు రాష్ట్రాల్లో 6% ఓట్లను పోల్ చేస్తుంది.
– ఒక పార్టీ నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తించబడుతుంది.
ప్రస్తుత జాతీయ పార్టీలు
1. భారతీయ జనతా పార్టీ
2. భారత జాతీయ కాంగ్రెస్
3. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
సీపీఐ–ఎం
4. ఆమ్ ఆద్మీ పార్టీ
5. బహుజన్ సమాజ్ పార్టీ
6. నేషనల్ పీపుల్స్ పార్టీ