https://oktelugu.com/

ఇంజనీరింగ్ విద్యార్థులకు షాకింగ్ న్యూస్.. ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయంటే..?

దేశంలో ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో విద్యార్థులు ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఒక సర్వే ప్రకారం దేశంలో 13 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉండగా 7.36 లక్షల ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయి. అయితే వీరిలో సగం మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయని మిగిలిన సగం మంది ఉద్యోగాలు లేక సంవత్సరాలకు తరబడి వృథా చేస్తున్నారని అధ్యయనాల్లో తెలుస్తోంది. ఉద్యోగాలు సాధించిన వాళ్లలో చాలామంది చదువుకు సంబంధం లేని ఉద్యోగాలు చేస్తుండటం గమనార్హం. Also Read: రాత పరీక్ష లేకుండా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 24, 2020 / 10:13 AM IST
    Follow us on


    దేశంలో ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో విద్యార్థులు ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఒక సర్వే ప్రకారం దేశంలో 13 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉండగా 7.36 లక్షల ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయి. అయితే వీరిలో సగం మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయని మిగిలిన సగం మంది ఉద్యోగాలు లేక సంవత్సరాలకు తరబడి వృథా చేస్తున్నారని అధ్యయనాల్లో తెలుస్తోంది. ఉద్యోగాలు సాధించిన వాళ్లలో చాలామంది చదువుకు సంబంధం లేని ఉద్యోగాలు చేస్తుండటం గమనార్హం.

    Also Read: రాత పరీక్ష లేకుండా బ్యాంక్ ఉద్యోగాలు.. రూ.60 వేల వేతనంతో..?

    2019 – 20 విద్యా సంవత్సరం ప్రకారం అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఈ లెక్కలను వెల్లడించింది. దేశంలో ఇంజనీరింగ్ చదువు వాస్తవ పరిస్థితి ఈ విధంగా ఉంది. అయితే కంపెనీలు మాత్రం ఉద్యోగ ఖాళీలు ఎక్కువగానే ఉన్నాయని నైపుణ్యం కలిగిన ఇంజనీరింగ్ అభ్యర్థులు లేకపోవడం వల్ల ఆ ఉద్యోగాలను భర్తీ చేయడం లేదని చెబుతున్నాయి. విద్యార్థుల్లో ఎంతో క్రేజ్ ఉన్న ఇంజనీరింగ్ వాస్తవ పరిస్థితి ఈ విధంగా ఉంది.

    Also Read: నిరుద్యోగులకు ఐఓసీఎల్ శుభవార్త.. రూ.లక్ష వేతనంతో ఉద్యోగాలు..?

    కార్పొరేట్ కాలేజీలు ఉద్యోగం గ్యారంటీగా వస్తుందంటూ ప్రకటనలు ఇచ్చి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయలు ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నాయి. కార్పొరేట్ కాలేజీల్లో లక్షల్లో చెల్లించి చదివినా మంచి ఉద్యోగాలు వస్తాయనే గ్యారంటీ లేదు. సాఫ్ట్ వేర్ కంపెనీలు భారీ ప్యాకేజీలు ఇస్తాయని చాలామంది భావిస్తారు కానీ వాస్తవ పరిస్థితి మాత్రం మరో విధంగా ఉండటం గమనార్హం.

    మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

    బీటెక్, ఎంటెక్ చదువులు చదివిన వాళ్లు దేశంలోని పలు ప్రాంతాల్లో నాలుగంకెల వేతనానికే పని చేస్తుండటం గమనార్హం. మరి కొందరు వ్యాపారం వైపు అడుగులు వేస్తున్నా బిజినెస్ లో సక్సెస్ శాతం తక్కువగా ఉండటం వాళ్లను భయపెడుతోంది. విద్యార్థి దశ నుంచే సబ్జెక్టుపై పట్టును పెంచుకుని, ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలను అలవరచుకుంటే కెరీర్ లో ఉన్నత స్థానాలకు ఎదగటం గ్యారంటీ అని చెప్పవచ్చు.