https://oktelugu.com/

డేంజర్: వెలుగుచూసిన మరో రకం కరోనా

కరోనా మహమ్మారి విచ్చలవిడిగా మారుతోంది. మనుషులను చంపేందుకు మరోసారి ఉగ్రరూపం దాలుస్తోంది. బ్రిటన్ లో రెండో రకం కరోనా ఇప్పటికే అక్కడ మరణ మృదంగం వాయిస్తోంది. అది మరువక ముందే ఇప్పుడు దక్షిణాఫ్రికా నుంచి మూడో రకం కరోనా బ్రిటన్ లో వ్యాపించింది. అది ప్రపంచదేశాలకు పాకి అల్లకల్లోలం చేస్తోంది. రెండో రకం కరోనానే చాలా పవర్ ఫుల్ గా ఉండడం.. ఇప్పుడు అంతకు మించి మూడో రకం వెలుగుచూడడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వైరస్ లు […]

Written By:
  • NARESH
  • , Updated On : December 24, 2020 / 10:12 AM IST
    Follow us on

    కరోనా మహమ్మారి విచ్చలవిడిగా మారుతోంది. మనుషులను చంపేందుకు మరోసారి ఉగ్రరూపం దాలుస్తోంది. బ్రిటన్ లో రెండో రకం కరోనా ఇప్పటికే అక్కడ మరణ మృదంగం వాయిస్తోంది. అది మరువక ముందే ఇప్పుడు దక్షిణాఫ్రికా నుంచి మూడో రకం కరోనా బ్రిటన్ లో వ్యాపించింది. అది ప్రపంచదేశాలకు పాకి అల్లకల్లోలం చేస్తోంది. రెండో రకం కరోనానే చాలా పవర్ ఫుల్ గా ఉండడం.. ఇప్పుడు అంతకు మించి మూడో రకం వెలుగుచూడడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వైరస్ లు అనుకూల శీతాకాలంలో రూపాంతరం చెందడం సాధారణమేనని నిపుణులు చెప్తున్నారు.

    Also Read: కేంద్రం సంచలన నిర్ణయం.. ఎస్సీ విద్యార్థులకు శుభవార్త..?

    డిసెంబర్ 22 నుంచి ఇప్పటివరకు బ్రిటన్ లోనే మొత్తం 691 మరణాలు సంభవించాయి. వైరస్ వ్యాప్తి పెరిగితే హెల్త్ కేర్ వ్యవస్థ దెబ్బతింటుందని బ్రిటన్ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. దీంతో బ్రిటన్ లో ఆంక్షలు అమలు చేస్తున్నారు.

    బ్రిటన్ దేశానికి సౌతాఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల్లో ఈ కొత్త రకాన్ని నిర్ధారించినట్టు చెప్పారు. గత రెండు వారాల్లో సౌతాఫ్రికా నుంచి బ్రిటన్ వచ్చిన వారంతా తక్షణం ఐసోలేషన్ లోకి వెళ్లాలని సూచించారు. సౌతాఫ్రికాలో పుట్టుకొచ్చిన కొత్త కరోనా వేరియంట్‌ను 501.V2గా పరిగణిస్తున్నారు. బ్రిటన్‌లో వెలుగుచూసిన సెకండ్ వేరియంట్ కంటే ఇది అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అక్కడి రిపోర్టులు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే సౌతాఫ్రికాకు కూడా విమాన రాకపోకలను దేశాలు తాత్కాలికంగా నిషేధించాయి.

    Also Read: రియల్ బాషా…పోలీస్ బెటాలియన్ మొత్తం దండం పెట్టారు!

    బ్రిటన్ లో కరోనా వైరస్ మూడో రకాన్ని గుర్తించినట్టు బ్రిటన్ హెల్త్ సెక్రటరీ మాట్ హన్ కాక్ బుధవారం సంచలన ప్రకటన చేశారు. మూడో రకం కరోనా వేగంగా వ్యాప్తి చెందేలా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం దీనిపై పరిశోధనలు సాగుతున్నాయని.. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయగలుగుతామని విశ్వసిస్తున్నట్టు తెలిపారు.

    శీతాకాలం వచ్చేసరికి కరోనా మరింత వేగవంతమవుతోంది. ఊహించని విధంగా రూపాంతరం చెందుతూ మనుషుల ప్రాణాలు తీస్తోంది. ఇప్పటికే బ్రిటన్ లో రూపాంతరం చెందిన కరోనా ప్రపంచదేశాలను వణికిస్తుండగా.. ఇప్పుడు మూడో రూపాంతరం ఆందోళన కలిగిస్తోంది.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్