https://oktelugu.com/

రైల్వేలో 3,591 ఉద్యోగ ఖాళీలు.. పదో తరగతి అర్హతతో..?

వెస్టర్న్‌ రైల్వేకి చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారత రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థ భారీ సంఖ్యలో అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఏకంగా 3,591 ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. పదో తరగతి, ఐటీఐ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : May 21, 2021 / 12:05 PM IST
    Follow us on

    వెస్టర్న్‌ రైల్వేకి చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారత రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థ భారీ సంఖ్యలో అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఏకంగా 3,591 ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. పదో తరగతి, ఐటీఐ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

    ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. https://www.rrc-wr.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫిట్టర్‌, వెల్డర్‌, మెషినిస్ట్‌, కార్పెంటర్‌, పెయింటర్‌, మెకానిక్‌, ఎలక్ట్రీషియన్‌, వైర్‌మెన్‌ ఇతర విభాగాల్లో ఖాళీలు ఉండగా పదో తరగతి పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

    ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు. జూన్ 24వ తేదీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.

    ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు కాకుండా మిగిలిన అభ్యర్థులు 100 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.