Read : ఒకప్పుడు పిల్లలకు చదువుకోవడం ఆడుకోవడం ఇదే పని. కానీ ఇప్పుడు ఆడుకోవడం, చదువుకోవడం రెండు కూడా తగ్గిపోయాయి. స్కూల్ నుంచి కాలేజీల వరకు అప్పుడు పుస్తకాలు చదవడమే మంచి హాబీ అని చెప్పేవారు. కానీ ఇప్పుడు ఆ విధానం కనిపించడం లేదు. ప్రతి రోజు ఎన్నో పుస్తకాలు తిరిగేసేవారు. కానీ ఇప్పుడు కనీసం పుస్తకం పట్టడం కూడా బద్దకంగా మారిపోయిన పిల్లలు ఎందరో ఉన్నారు. దీనంతటికి కారణం ఫోన్, టీవీ. వీటి వల్ల బోర్ కొట్టదు. సో చదవాలి, ఆడుకోవాలి అనిపించదు. ఆడుకోవాలి అనుకున్న కదలకుండా కూర్చొని ఫోన్ లో ఆడుతున్నారు పిల్లలు.
చాలా మందికి లైఫ్ లెసన్స్ ఇతరుల గురించి చూసినప్పుడు చదువుకోవాలి అనిపిస్తుంది. కానీ మళ్లీ అక్కడ నుంచి దూరంగా జరుగుతుంటారు. మనసులో చదువుకోవాలి అని ఉన్నా సరే మైండ్ మాత్రం ఇతర పనుల గురించి ఆలోచిస్తుంటుంది. ఇక చదువు మీద శ్రద్ధనే ఉండదు. అందుకే మీరే చదివే విషయంలో పటిష్టంగా, కట్టుదిట్టంగా, పక్కా ప్లాన్ గా ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలి. ఇలా పాటించడం వల్ల కచ్చితంగా బాగా చదువుకుంటారు. ఇంతకీ మంచి చదువు మీ సొంతం కావాలంటే మీరు చేయాల్సిన ఆ పనులు ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
స్వీయ-అధ్యయనం మీరు బాగా నేర్చుకోవడంలో, మీ ఉత్పాదకతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మీ పనులు మీరు చేసుకోవడం, ఒత్తిడిని తగ్గించడానికి వాస్తవిక లక్ష్యాలను సెట్ చేయడం ద్వారా మీ డేను ప్రారంభించండి. ఆసక్తికరంగా నేర్చుకోవడం కోసం ఇబుక్స్, వీడియోలు, ట్యుటోరియల్‌ల వంటి విభిన్న అధ్యయన సాధనాలను ఉపయోగించడం వల్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రేరణతో ఉండటానికి మీ బలాలు, ఆసక్తులను అర్థం చేసుకోడం చాలా ముఖ్యం. సమతుల్యతను కాపాడుకోవడానికి, విసుగు చెందకుండా ఉండటానికి ప్రతిరోజూ ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులను అధ్యయనం చేయడం అలవాటు చేసుకోండి.
మీరు నేర్చుకున్న వాటిని గుర్తుంచుకోవడానికి ప్రతిరోజూ మననం చేసుకోండి. ముఖ్య అంశాలను హైలైట్ చేయడానికి స్టిక్కీ నోట్‌లను ఉపయోగించండి. మీ పురోగతిని ట్రాక్ చేయడానికి ప్రాక్టీస్ పేపర్లు లేదా క్విజ్‌లతో మిమ్మల్ని మీరు క్రమం తప్పకుండా పరీక్షించుకోండి. కఠినమైన అంశాలను సులభతరం చేయడానికి, కొత్త భావనలను సులభంగా తెలుసుకోవడానికి వీడియోలను చూడండి. మీకు ఎలాగూ ఫోన్ అంటే ఇష్టమే కదా. సో ఈ విధంగా ఫోన్ చూడండి. దృష్టి కేంద్రీకరించడానికి, పరధ్యానాన్ని నివారించడానికి నిశ్శబ్ద, వ్యవస్థీకృత అధ్యయన స్థలాన్ని సృష్టించండి.
అవగాహన పెంచుకోవడానికి కాస్త గట్టిగా చదవండి. కొందరికి మనసులో చదివితేనే మంచిగా వస్తుంది. ఛాయిస్ మీది. కానీ చదువుతున్నప్పుడు శ్రద్ధ మస్ట్. అమ్మ చేసే సమోసాలు, చపాతీల గురించి ఆలోచన వద్దు. పక్కన టీవీ సౌండ్ ల మీకు అసలు వినిపించకూడదు. ఇక మీ మనస్సును రిఫ్రెష్ చేయడానికి, ఏకాగ్రతతో ఉండటానికి చదువుతున్నప్పుడు క్రమం తప్పకుండా విరామం తీసుకోవడం కూడా చాలా అవసరం.