upsc cds ii recruitment 2021: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగులకు మరో తీపికబురు అందించింది. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కు సంబంధించిన నోటిఫికేషన్ ను ఈ సంస్థ విడుదల చేసింది. మొత్తం 339 ఉద్యోగ ఖాళీలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. ఎయిర్‌ఫోర్స్, నేవీ, మిలిటరీ ఫోర్స్‌లో ప్రధానంగా ఈ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలతో పాటు ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో కొన్ని పోస్టులు ఉన్నాయి.
https://upsc.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగష్టు నెల 24వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. మొత్తం 339 ఉద్యోగ ఖాళీలలో ఇండియన్ మిలిటరీ అకాడమీ, డెహ్రడూన్ లో 100, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎజిమళలో 22, ఎయిర్‌ఫోర్స్ అకాడమీ, హైదరాబాద్ లో 32, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నైలో పురుషులకు 169, మహిళలకు 16 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.
డిగ్రీ, బీటెక్ పాసైన వాళ్లు కమర్షియల్ పైలెట్ లైసెన్స్, నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉంటే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 20 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాలి. ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్ లైన్ లో https://upsconline.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు. జనరల్ అభ్యర్థులకు మాత్రం ఈ ఉద్యోగ ఖాళీలకు 200 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉంది. హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నం, విజయవాడ ఈ ఉద్యోగ ఖాళీలకు పరీక్ష కేంద్రాలుగా ఉన్నాయి. ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.