Homeఎడ్యుకేషన్SSC Result 2024 Telangana: టెన్త్‌ ఫలితాలు విడుదల.. నిర్మల్‌ ఫస్ట్‌.. వికారాబాద్‌ లాస్ట్‌!

SSC Result 2024 Telangana: టెన్త్‌ ఫలితాలు విడుదల.. నిర్మల్‌ ఫస్ట్‌.. వికారాబాద్‌ లాస్ట్‌!

TS SSC Results: పదో తరగతి పరీక్ష ఫలితాలు మంగళవారం(ఏప్రిల్‌ 30న) విడుదలయ్యాయి. పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సెక్రెటరీ బుర్రా వెంకటేశం ఉదయం 11 గంటలకు టెన్త్‌ ఫలితాలను విడుదల చేశారు. రికార్డు స్థాయిలో ఈసారి 91.31 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో ఎప్పటిలాగే బాలికలు పైచేయి సాధించారు. బాలురు 89. 42 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 93.23 శాతం ఉత్తీర్ణత సాధించారు.

నిర్మల్‌ ఫస్ట్‌..
ఫలితాల్లో నిర్మల్‌ జిల్లా 99.09 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలవగా, రంగారెడ్డి, సిరిసిల్ల జిల్లాలు రెండు, మూడో స్థానాల్లో నిలిచాయి. వికారాబాద్‌ జిల్లా 65.01 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది. నిర్మల్‌ మొదటి స్థానంలో నిలవడం ఇది వరుసగా రెండో ఏడాది. ఇక ఫెయిల్‌ అయిన, తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు 15 రోజుల సమయం ఇచ్చారు. రీకౌంటింగ్‌కు రూ.500, రీ వెరిఫికేషన్‌కు రూ.1000 ఫీజు నిర్ణయించారు. 8,883 మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించారు. 3,927 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఆరు పాఠశాలల్లో సున్నా రిజల్ట్‌ వచ్చింది. గతేడాది పదో తరగతిలో 89.60 శాతం ఉత్తీర్ణత రాగా, ఈసారి 91,31 శాతానికి పెరగింది.

జూన్‌ 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు..
ఇక అవ్డాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు జూన్‌ 3 నుంచి 13 వరకు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.

మార్చిలో పరీక్షలు..
ఈసారి పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు జరిగాయి. వీటికి 5,08,385 మంది హాజరయ్యారు. వరిలో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. ఫలితాల్లో 4,91,862 మంది ఉత్తీర్ణత సాధించారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version