UPSC CSE 2022 Result : అఖిల భారత సర్వీసు నియామకాలకు సంబంధించి యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. తెలుగు విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభకనబరిచారు. ఉత్తమ ర్యాంకులు సాధించారు. అమ్మాయిలే టాప్ ర్యాంకుల్లో నిలవడం విశేషం. తొలి నాలుగు ర్యాంకులు అమ్మాయిలే హస్తగతం చేసుకున్నారు. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ గా ఇషితా కిశోర్ నిలిచారు. గరిమా లోహియా ద్వితీయ, ఉమా హారతి తృతీయ, స్మృతిమిశ్రా నాలుగో ర్యాంకర్ గా నిలిచారు. వారికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సైతం ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఏపీలోని తిరుపతికి చెందిన పవన్ దత్తా 22వ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి శ్రీ సాయి అర్షిత్ -40 ర్యాంక్, ఆవు ల సాయికృష్ణ -94, అనుగు శివ మారుతీ రెడ్డి 132, రాళ్ళపల్లి వసంత్ కుమార్ 157, కమతం మహేష్ కుమార్ 200, రావుల జయసింహారెడ్డి 217, బొల్లం ఉమామహేశ్వర్ రెడ్డి 270, చల్ల కళ్యాణి 285, పాలువాయి విష్ణు వర్ధన్ రెడ్డి 292, గ్రంథి సాయికృష్ణ 293, వీరగంధం లక్ష్మి సుజిత 311, ఎన్ చేతన రెడ్డి – 346, శృతి యరగట్టి 362, యప్పలపల్లి సుస్మిత -384, సీహెచ్ శ్రవణ్ కుమార్ రెడ్డి 426, బొల్లపల్లి వినూత్న 462 ర్యాంకులతో మెరిశారు.
మొత్తం ఈ నియామక ప్రక్రయిలో 933 మందిని ఎంపిక చేసినట్లు యూపీఎస్సీ ప్రకటించింది. వీరిలో ఐఏఎస్ పోస్టులకు 180 మంది, ఐఎఫ్ఎస్ లకు 38 మంది, ఐపీఎస్ సర్వీసులకు 200 సెలక్ట్ అయ్యారు. రిజర్వేషన్లకు సంబంధించి జనరల్ కోటా కింద -345 మంది, ఓబీసీ- 263 మంది, ఈడబ్ల్యూఎస్ -99 మంది, ఎస్సీ- 154 మంది, ఎస్టీ -72 మంది ఉన్నారు.