Part Time Jobs: పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేయాలని అనుకుంటున్నారా.. ఈ ఉద్యోగాలే బెస్ట్!

Part Time Jobs: మనలో చాలామంది ఫుల్ టైమ్ ఉద్యోగాలు చేయడంతో పాటు అదనపు సంపాదన కొరకు పార్ట్ టైమ్ ఉద్యోగాలపై ఆసక్తి చూపిస్తుంటారు. ఇంటికే పరిమితమైన గృహిణులు, వ్యాపారులు కూడా తీరిక సమయాల్లో పార్ట్ టైమ్ జాబ్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారనే సంగతి తెలిసిందే. అయితే ఎలాంటి ఉద్యోగాలు చేస్తే మంచిదనే ప్రశ్నకు చాలామంది సరైన సమాధానం దొరకకపోవడం వల్ల చాలామంది పార్ట్ టైమ్ జాబ్ విషయంలో వెనుకడుగు వేస్తున్నారు. పార్ట్ టైమ్ జాబ్ చేయాలని […]

Written By: Kusuma Aggunna, Updated On : March 3, 2022 4:36 pm
Follow us on

Part Time Jobs: మనలో చాలామంది ఫుల్ టైమ్ ఉద్యోగాలు చేయడంతో పాటు అదనపు సంపాదన కొరకు పార్ట్ టైమ్ ఉద్యోగాలపై ఆసక్తి చూపిస్తుంటారు. ఇంటికే పరిమితమైన గృహిణులు, వ్యాపారులు కూడా తీరిక సమయాల్లో పార్ట్ టైమ్ జాబ్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారనే సంగతి తెలిసిందే. అయితే ఎలాంటి ఉద్యోగాలు చేస్తే మంచిదనే ప్రశ్నకు చాలామంది సరైన సమాధానం దొరకకపోవడం వల్ల చాలామంది పార్ట్ టైమ్ జాబ్ విషయంలో వెనుకడుగు వేస్తున్నారు.

Part Time Jobs

పార్ట్ టైమ్ జాబ్ చేయాలని భావించే వాళ్లకు కస్టమర్ సర్వీస్ ఉద్యోగాలు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. కొన్ని కంపెనీలు ఇంటినుంచే ఈ ఉద్యోగాలను చేసే అవకాశాన్ని కల్పిస్తుండగా మరికొన్ని కంపెనీలు మాత్రం ఆఫీస్ కు వచ్చి విధులు నిర్వహించాలని నిబంధనలను విధిస్తున్నాయి. నియమిత సమయాన్ని ఎంచుకుని సులభంగా ఈ ఉద్యోగాలు చేసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

Also Read: విద్యారంగంలో జగన్ మార్పులు.. ఏపీ భవిష్యత్తును మార్చుతుందా? కూల్చుతుందా?

కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉన్నవాళ్లు సేల్స్ కన్సల్టెంట్ గా కెరీర్ ను కొనసాగించవచ్చు. సేల్స్ కన్సల్టెంట్ గా పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసి కళ్లు చెదిరే శాలరీని సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం హోమ్ ట్యూటర్లకు కూడా డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. టాలెంట్ ఉన్నవాళ్లు హోమ్ ట్యూటర్ గా పని చేసి తక్కువ సమయంలోనే ఎక్కువ మొత్తాన్ని సంపాదించుకునే ఛాన్స్ ఉంటుంది.

ప్రస్తుతం మార్కెట్ లో కంటెంట్ రైటర్ ఉద్యోగాలకు కూడా ఊహించని స్థాయిలో డిమాండ్ ఉంది. గ్రామర్ పై అవగాహన, తప్పులు లేకుండా రాసే ప్రతిభ ఉంటే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాఫిక్ డిజైనర్ ఉద్యోగాలు కూడా ఇంటినుంచి ఉద్యోగాలు చేయాలని భావించే వాళ్లకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

Also Read: అమరావతి రైతులకు జగన్ క్షమాపణ చెప్పాల్సిందే..?

Recommended Video: