Latest Trends In Jobs: కరోనా అందరి జీవితాలను మార్చేసింది. ఇంట్లోనే పని వాతావరణాన్ని సృష్టించింది. ఇన్నాళ్లు ఉదయం వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చే ఐటీ ఉద్యోగుల జీవితాలను వర్క్ ఫ్రం హోం పేరిట పరిమితం చేసింది. మొదట్లో దీన్ని భారంగా భావించిన ఉద్యోగులు.. ఇప్పుడు దీన్ని కూడా ‘క్యాష్’ చేసుకున్నారు. ఇంట్లోనే ఒకటికి మించి ఉద్యోగాలు చేస్తూ రెండు చేతులా సంపాదించుకుంటున్నారు. ఆఫీసుకు రమ్మంటే రావడం లేదు. అవసరమైతే ‘జాబ్ రిజైన్ చేస్తామంటున్నారు’. ఈజీ ఉద్యోగాల కోసం ఎంతపెద్ద జాబ్ అయినా.. ఎన్ని లక్షల జీతాలనైనా వదిలేస్తున్నారు.

ఇటీవల కాలంలో ‘క్వైట్ క్వెట్టింగ్’ బాగా ప్రాచుర్యం పొందుతోంది. కరోనా ప్రభావంతో ఉద్యోగులకు పనిభారం తగ్గుతోంది. వర్క్ ఫ్రం హోం కావడంతో ఇంట్లోనే ఒక కంపెనీకి తెలియకుండా మరో కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నారు. చాలా మంది ఐటీ నిపుణులు రెండు ఉద్యోగాలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీనికి కంపెనీలు ఒప్పుకోవడం లేదు. దీంతో ఉద్యోగాలను వదిలేసి వేరే జాబ్ చూసుకోవడానికి కూడా టెక్కీలు వెనుకాడడం లేదు. దీంతో క్వైట్ క్వెట్టింగ్ పై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఐటీ కంపెనీలు ఉద్యోగులు చేస్తున్న దానికి ఏం చెప్పలేకపోతున్నాయి. సరైన తీరుగా వారి నుంచి పని తీసుకోవడం లేదనే ఆరోపణలు సైతం వస్తున్నాయి. రెండు సంస్థల్లో ఉద్యోగం చేయడం వల్ల సరైన న్యాయం చేయడం లేదని విప్రో సంస్థ అధినేత అజీమ్ ప్రేమ్ జీ ఆందోళన వ్యక్తం చేశారు.. క్వైట్ క్వెట్టింగ్ సమస్య ఈ కాలపు ఉద్యోగాల్లో సరికొత్త పోకడలకు దారితీస్తోంది.
Also Read: Pawan Kalyan: ప్రజారాజ్యంలా కానివ్వను.. జనసేనలోని కోవర్టులకు పవన్ కళ్యాణ్ హెచ్చరిక
క్వైట్ క్విట్టింగ్ అంటే పనిభారాన్ని తగ్గించుకోవడమే. ఒకప్పటిలా గానుగెద్దులా చేయకుండా కేవలం వారి పాత్రకు మాత్రమే పరిమితం కావడం.. ఉద్యోగులు బాధ్యతలను మాత్రం మరవడం లేదు. పనిని నిర్లక్ష్యం చేయడం లేదు. బతకడానికి ఉద్యోగం కావాలి కానీ బతుకే ఉద్యోగం కాకూడదని తెలుసుకుంటున్నారు. కరోనా వల్ల ఎంతో మందిలో మార్పు వచ్చింది. వారి వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని సమతుల్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే మీద వేసుకొని ఉద్యోగాలు చేయడం లేదు. అదిలిస్తే ఉద్యోగాలు వదిలేస్తున్నారు.. సులభంగా పనిచేసే సంస్థల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 7 కోట్ల మందికి స్థానచలనం కలిగింది. అందరు ఉద్యోగాలు మారారు. దీన్ని గ్రేట్ రిసిగ్నేషన్ గా చెబుతారు. దీన్ని క్వైట్ క్విట్టింగ్ గా వ్యవహరిస్తుంటారు. భారత్ లో ఈ విధమైన సంప్రదాయం ఇప్పుడే మొదలైంది. ఇప్పటికే పాశ్చాత్య దేశాల్లో ప్రముఖంగా కనిపిస్తోంది. కొవిడ్ తరువాత వ్యక్తిగత జీవితానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. కుటుంబం కోసం సమయం కేటాయిస్తున్నారు. గతంలో వ్యక్తిగత లక్ష్యాల కోసం పనిచేసే వారు ప్రస్తుతం కుటుంబ క్షేమం కోసమే సమయం ఇస్తున్నారు.

ఐటీ ఉద్యోగులు మూన్ లైటింగ్ కు ఇష్టపడుతున్నారు. మూన్ లైటింగ్ అంటే ఒక ఉద్యోగి రెండు కంపెనీల్లో ఉద్యోగం చేయడం… కరోనా ప్రభావంతో వర్క్ ఫ్రం హోం అమలులోకి రావడంతో ఇంటి నుంచి పని చేసుకునే వారు మరో కంపెనీని కూడా మాట్లాడుకుని రెండు సంస్థలకు పనిచేస్తూ బాగా సంపాదిస్తున్నారు. ఇదేదో బాగా వర్కవుట్ కావడంతో ఐటీ ఉద్యోగులు ఈ రెండు జాబ్స్ చేసే ‘మూన్ లైటింగ్’ కు బాగా ఆకర్షితులవుతున్నారు. ఫలితంగా కొత్త ట్రెండ్ కు ఓటు వేయడంతో డ్యూయల్ ఎంప్లాయిమెంట్ అనే చర్చ కూడా సాగుతోంది.
క్వైట్ క్విట్టింగ్ ఇప్పటిది కాదు. ఎప్పటి నుంచో ఉంది. దీనికి అనేక కారణాలున్నాయి. ఉద్యోగంలో అసంతృప్తి, పెరిగిన ధరలు, తక్కువ వేతనాలు, గుర్తింపు లేకపోవడం, భవిష్యత్ ఆశలు లేకపోవడం వంటి అంశాలు క్వైట్ క్విటింగ్ కు మార్గాలుగా నిలుస్తున్నాయి. ఉద్యోగంలో ఎంతటి ప్రతిభ చూపించినా గుర్తింపు మాత్రం లేకపోవడం విడ్డూరమే. దీంతోనే క్వైట్ క్విట్టింగ్ కు ద్వారాలు తెలుస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల్లో విముఖత, ఎక్కువ పనిచేయడానికి నిరాసక్తత, అదనపు జీత భత్యాలు లేకపోవడం, ఇతరుల స్థానంలో పని చేయడానికి ఇష్టపడకపోవడం, పనికి ఆలస్యంగా రావడం వంటి అంశాలు క్వైట్ క్విట్టింగ్ లో భాగమే కావడం గమనార్హం.