
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులకు ప్రయోజనం చేకూరేలా గురుకుల్ సైనిక్ స్కూల్స్ నుంచి టీచింగ్ జాబ్స్ కు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. రుక్మాపూర్‌లో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర సంక్షేమ సైనిక విద్యాలయం, అశోక్ నగర్ లో ఉన్న గిరిజన గురుకుల సైనిక పాఠశాల, తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఔట్ సోర్సింగ్ విధానం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరుగుతుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు గురుకుల స్కూల్స్ లో ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానంలో మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మే 10వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. రాతపరీక్ష, డెమో, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
విడుదలైన నోటిఫికేషన్ లో జేఎల్, ఆర్ట్, కంప్యూటర్ సైన్స్, కౌన్సిలర్, టీజీటీ, పీజీటీ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. టెట్ లో అర్హత సాధించి బీఈడీ పూర్తిచేసిన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత సబ్జెక్టులో పీజీ చేసిన వాళ్లు ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారు. రాతపరీక్ష, డెమో, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. రాతపరీక్షకు 100 మార్కులు కాగా డెమోకు 25, ఇంటర్వ్యూకు 25 మార్కుల చొప్పున ఉంటాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 500 రూపాయలు డీడీ తీయాల్సి ఉంటుంది. https://tswreis.in/ లేదా https://tgtwgurukulam.telangana.gov.in/ వెబ్ సైట్ల ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.