Students: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం అనే పథకాలు అమలు చేస్తున్నాయి. పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా అమలు చేస్తున్నాయి. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు కూడా బ్యాంకు రుణాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ఆర్థికసాయం అందిస్తున్నాయి.
స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తులు..
కేంద్ర ప్రభుత్వం కూడా ఏటా విద్యార్థులకు జాతీయ స్కాలర్‌షిప్ అందిస్తోంది. ఈ బెనిఫిట్స్ పొందాలనుకునేవారు నేషనల్ స్కారర్‌షిప్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈమేరకు ఇటీవలే 2024కు సంబంధించిన స్కాలర్‌షిప్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాలేజీ, యూనివర్సిటీ విద్యార్థులు నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ఇంటర్‌బోర్డు కూడా వెల్లడించింది. ఈ ఏడాది ఇంటర్ పాసైన విద్యార్థులు అక్టోబర్ 31 నాటికి దరఖాస్తు చేసుకోవచ్చు.
రెన్యూవల్‌కు ఛాన్స్..
స్కాలర్‌షిప్ కోసం గతంలో దరఖాస్తు చేసిన వారు 2024–25 విద్యాసంవత్సరం కోసం మరోసారి రెన్యూవల్ చేసుకోవాలని సూచించింది. నవంబర్ 15లోగా నోడల్ అధికారి వెరిఫికేషన్ చేస్తారని ఇంటర్ బోర్డు వెల్లడించింది.
దరఖాస్తు విధానం..
ఈ వెబ్‌సైట్‌లో స్టూడెంట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇక్కడ అప్లయ్ ఫర్ స్కాలర్‌షిప్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తర్వాత విద్యార్థుల వివరాలను నమోదు చేయాలి. మొబైల్ నంబర్ కు వచ్చే ఓటీపీ, పాస్ వర్డ్ సహాయంతో విద్యార్థులు స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు నమోదు చేసి దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
అవసరమైన పత్రాలు..
ఎన్‌ఎస్పీ దరఖాస్తుకు అవసరమైన పత్రాలు.. బ్యాంక్ పాస్ బుక్, వినియోగంలో ఉన్న మొబైల్ నంబర్, అడ్రెస్ ఫ్రూప్, మార్కుల మెమో అండ్ పాస్ పోర్టు సైజ్ ఫోటో కూడా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఎన్‌ఎస్పీకి దరఖాస్తుత చేసుకునే విద్యార్థి భారత పౌరుడై ఉండాలి. విద్యార్థులు మునపటి తరగతిలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించకూడదు.
నేషనల్ స్కాలర్‌షిప్ రకాలు..
నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ విస్తతశ్రేణి స్కాలర్‌షిప్ అవకాశాలను అందిస్తుంది. వివిధ విద్యాస్థాయిలలోని విద్యార్థులు తమ అధ్యయనాలకు మద్దతు ఇవ్వడానికి ఆర్థికసహాయాన్ని పొందవచ్చు.
ప్రీ, పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు..
1 నుంచి 10వ తరదగతుల విద్యార్థులకు 11, 12 తరగతుల విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్ అందించబడుతుంది. విద్యార్థులు వారి కుటుంబ ఆదాయం, విద్యాస్థితిని బట్టి ఆర్థికసాయం అందించబడుతుంది.
అండర్ గ్రడ్యుయేట్ స్కాలర్‌షిప్‌లు..
బ్యాచ్‌లర్ డిగ్రీ కోసం ఎవరైనా ఎన్‌ఎస్పీ నుంచి స్కాలర్‌షిప్‌లు పొందవచ్చు. ఈ స్కాలర్‌షిప్‌ల ఉద్దేశం ఉన్నత విద్యను అభ్యసిండంలో విలువైన విద్యార్థులయు సాయం చేయడం.
పోస్టు గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌లు..
మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులను అభ్యసించే విద్యార్థులకు ఎన్‌ఎస్పీ స్కాలర్‌షిప్‌లను అందిస్తుంది. ఈ స్కాలర్‌షిప్‌లు విద్యార్థులు అధునాతన అధ్యయనాలు, పరిశోధనలు కొనసాగించడానికి సహాయపడతాయి.
పీహెచ్‌డీ స్కాలర్‌షిప్‌లు..
డాక్టరల్ అధ్యయనాలను అభ్యసించే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను కూడా ఎన్‌ఎస్సీ కవర్ చేస్తుంది. ఈ స్కాలర్‌షిప్‌లు పరిశోధన స్కాలర్‌లకు వారి విద్యా విషయాలలోనూ మద్దతు ఇస్తాయి.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Telangana inter board invited applications from students under the national merit scholarship
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com