https://oktelugu.com/

Pragati Bhavan: ప్రగతి భవన్ ముట్టడికి నిరుద్యోగుల యత్నం

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని పీడీఎస్ యూ ఆధ్వర్యంలో నిరుద్యోగులు సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ మట్టడికి యత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డివైడర్ మధ్యలో ఉన్న గ్రిల్స్ ఎక్కి మరీ ప్రగతి భవన్ వైపు విద్యార్థి, యువజన సంఘ నేతలు పరుగులు తీయడంతో పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్ట్ చేసి గోషామహాల్ స్టేషన్ కు తరలించారు. నిరుద్యోగులకు వయసు మీరి పోతున్నా ఈ ఏడాది ఇప్పటి వరకు […]

Written By: , Updated On : August 24, 2021 / 02:01 PM IST
Follow us on

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని పీడీఎస్ యూ ఆధ్వర్యంలో నిరుద్యోగులు సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ మట్టడికి యత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డివైడర్ మధ్యలో ఉన్న గ్రిల్స్ ఎక్కి మరీ ప్రగతి భవన్ వైపు విద్యార్థి, యువజన సంఘ నేతలు పరుగులు తీయడంతో పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్ట్ చేసి గోషామహాల్ స్టేషన్ కు తరలించారు. నిరుద్యోగులకు వయసు మీరి పోతున్నా ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు.